WEBVTT

00:01.668 --> 00:05.339
నేనే. రివర్ ని. ఆ తుపాకీని కాస్త కింద పెడతావా?

00:59.726 --> 01:00.727
నేనే.

01:05.566 --> 01:06.567
సరే మరి.

01:15.701 --> 01:16.702
నేనే, రివర్ ని.

01:23.625 --> 01:25.002
ఎక్కడ ఉన్నావు?

01:39.933 --> 01:40.767
ఏం...

01:44.229 --> 01:45.772
ఒంటి మీద బట్టలున్నాయి కదా!

01:59.369 --> 02:01.371
ఓహ్... బాబోయ్. అయ్య బాబోయ్.

02:03.707 --> 02:05.042
తాతయ్య.

02:06.502 --> 02:07.920
దేవుడా, ఎంత పని చేశావు నువ్వు?

02:08.794 --> 02:10.464
ఆ తుపాకీని కింద పెట్టేయ్, సరేనా?

02:12.591 --> 02:14.510
నేనే. రివర్ ని.

02:16.428 --> 02:18.847
- దయచేసి విను. నేను రివర్ ని.
- అక్కడ ఎలా ప్రత్యక్షమయ్యావు?

02:20.599 --> 02:22.351
- ఇప్పుడే కదా నిన్ను కాల్చాను.
- లేదు, నువ్వు కాల్చలేదు.

02:23.477 --> 02:25.229
- దయచేసి, ఆ తుపాకీ ఇలా ఇవ్వు.
- నీ ఉద్దేశం...

02:25.729 --> 02:28.565
నీ స్థానంలో వచ్చిన మోసగాడా వీడు?

02:28.565 --> 02:31.276
నాకు తెలీదు, సరేనా? ముందు ఆ తుపాకీ ఇవ్వు.

02:31.276 --> 02:33.987
నువ్వు కూడా అలాంటి మోసగాడివే అయ్యుండవచ్చు కదా?

02:35.989 --> 02:37.407
నాకు మాత్రమే తెలిసి ఉండే ప్రశ్న ఏమైనా అడుగు.

02:43.497 --> 02:46.834
నేను బెర్లిన్ లో నా హోదాలోనే ఉన్న
కేజీబీ ఏజెంట్ ని కలుసుకున్నా, అది క్రిస్మస్, 19...

02:46.834 --> 02:50.504
- 1982లో.
- అవును.

02:50.504 --> 02:53.257
మేము చాలా తాగేశాం.

02:54.550 --> 02:56.969
- నేను అతడిని ఏం చేశాను?
- మంచుతో ముద్దలు చేసి కొట్టుకున్నారు.

03:04.601 --> 03:05.978
ఓరి దేవుడా.

03:08.522 --> 03:10.315
సరే. ఏమీ కాలేదు, సరేనా?

03:11.108 --> 03:13.527
ఏమీ కాలేదు. కంగారు పడకు.

03:13.527 --> 03:17.072
ఏమీ కాదులే. నేను వచ్చాగా. నేను చూసుకుంటాలే.

03:18.365 --> 03:23.120
ఏం పర్లేదు. నీకేమీ కాదు. నీకేమీ కాదు. కూర్చో.

03:23.871 --> 03:28.292
దేవుడా. ఓరి దేవుడా.

03:33.338 --> 03:35.924
సరే. హేయ్, హేయ్. ఏమీ కాదులే.

03:35.924 --> 03:38.260
ఏమీ కాదు. నీకేమీ కాలేదు.

03:38.886 --> 03:44.349
అతడిని కాల్చాక, నిన్ను కాల్చానేమో అని అనుకున్నాను.

03:46.476 --> 03:47.686
ఇంకాస్త ఉంటే నిన్ను చంపేవాడిని.

03:52.232 --> 03:55.736
లేదు, లేదు. చూడు, దీన్ని నేను సరిచేస్తా.

03:55.736 --> 03:57.237
నేను దీన్ని సరిచేస్తాను, సరేనా?

03:57.237 --> 03:59.323
మనం ఇలాంటివి చాలా చూశాం, కదా?

03:59.323 --> 04:00.532
- లేదు.
- ఏమంటావు?

04:01.909 --> 04:03.619
పరిస్థితి దారుణంగానే ఉంది, కానీ...

04:06.413 --> 04:08.165
బాబోయ్. నాలానే ఉన్నాడే.

04:12.711 --> 04:13.712
సరే మరి.

04:13.712 --> 04:18.175
అసలు మొదట్నుంచీ ఏమైందో నాకు వివరంగా చెప్పరాదూ?

04:20.093 --> 04:21.470
హా, సరే...

04:24.681 --> 04:26.016
అతను తలుపు తట్టాడు,

04:27.518 --> 04:31.313
నేరుగా ఇక్కడికి వచ్చి,
స్నానానికి ఏర్పాటు చేస్తా అని చెప్పాడు.

04:31.313 --> 04:34.733
- సరే. నాలా నటించాడా?
- అవును.

04:36.360 --> 04:39.029
- నువ్వు కూడా అది నేనేనని అనుకున్నావా?
- మొదట్లో, నువ్వే అనుకున్నా.

04:39.947 --> 04:42.824
కానీ, నువ్వు ఎప్పుడూ అనని మాటని అతను అన్నాడు.

04:44.034 --> 04:45.285
నన్ను "తాతయ్య గారు" అని పిలిచాడు.

04:46.036 --> 04:50.290
నేను అతడిని నిలదీశా, అతను నాపైకి
దూసుకొచ్చాడు. ఇక నేను అతడిని కాల్చేశా.

04:50.290 --> 04:51.375
సరే. సరే.

04:52.459 --> 04:53.669
అతని దగ్గర ఆయుధం ఉందా?

04:54.753 --> 04:57.130
- లేదు, ఆయుధం ఉన్నట్టుగా అనిపించట్లేదు.
- దేవుడా.

04:58.048 --> 04:59.800
ఆయుధం లేని వాడిని నేను కాల్చాను.

04:59.800 --> 05:02.469
లేదు. నీ స్నానానికి ఏర్పాటు చేయాల్సిందిగా
నా లాంటి వ్యక్తిని పంపారంటే,

05:02.469 --> 05:04.805
ఏదో దురుద్దేశంతోనే పంపి ఉంటారు, అంతే కదా?

05:04.805 --> 05:08.767
- దేవుడా.
- చూడు. డయజెపామ్.

05:10.269 --> 05:12.521
అంటే, నీకు దీని ద్వారా మత్తు ఎక్కించి,
నీటిలో ముంచి చంపేయాలన్నదే ఇతని ప్లాన్.

05:12.521 --> 05:13.564
దేవుడా.

05:15.607 --> 05:17.985
ఫ్రాన్స్ తిరుగు ప్రయాణానికి టికెట్ ఒకటి ఉంది.

05:20.404 --> 05:21.905
"లె బ్లాంక్ రుస్."

05:23.240 --> 05:26.827
అది "లవాండ్"లో ఉండే కెఫే అట.

05:27.494 --> 05:30.038
లవాండ్, ఈ పేరు ఎక్కడైనా విన్నట్టుందా?

05:30.539 --> 05:33.792
- విన్నట్టు లేదు.
- ఓకేలే. పర్వాలేదు.

05:41.008 --> 05:42.009
"ఆడమ్ లాక్ హెడ్"?

05:44.678 --> 05:46.889
నువ్వు చాలా ప్రశ్నలు అడుగుతున్నావు.
నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా.

05:46.889 --> 05:49.516
లేదు, నువ్వు నేర్పినట్టే నేను కేవలం
వివరాలను ఆరా తీస్తున్నానంతే, సరేనా?

05:49.516 --> 05:51.852
బహుశా ఇవి నీకు గతంలో తెలిసిన పేర్లేమో,
కానీ ఇప్పుడు మర్చిపోయావేమో.

05:51.852 --> 05:54.563
- దీని సంగతి పార్క్ చూసుకుంటుందిలే.
- వద్దు, వద్దు. వద్దు.

05:54.563 --> 05:55.647
అబ్బా.

05:56.899 --> 05:58.650
- సూపర్. ఇప్పుడు మనకి పెద్దగా సమయం ఉండదు.
- దేనికి?

05:59.776 --> 06:03.030
వాళ్లు ఇక్కడికి వచ్చారంటే,
నువ్వు నాకు దూరమైపోతావు. అర్థమైందా?

06:03.030 --> 06:05.449
నువ్వు వాళ్లకి ఏదైనా పక్కాగా చెప్పగలగాలి.

06:05.449 --> 06:07.784
- నేను పక్కాగానే చెప్తాను.
- నువ్వు ఏదైనా చెప్పేస్తే,

06:07.784 --> 06:08.911
ఇక అంతే, సరేనా?

06:08.911 --> 06:10.370
దాన్ని మళ్లీ మార్చలేం. అదే నిజం అయిపోతుంది.

06:10.370 --> 06:12.581
ఒకటి చెప్పు, వాళ్లకి నేనెందుకు తప్పుగా చెప్తాను?

06:12.581 --> 06:15.542
- ఎందుకంటే, నీ ఆరోగ్యం బాగాలేదు.
- నాతో అలా మాట్లాడకు!

06:15.542 --> 06:16.919
నేను నీ తండ్రిని!

06:22.382 --> 06:23.383
దేవుడా.

06:24.676 --> 06:28.305
- తాతయ్యవి.
- అవును. అంటే...

06:29.806 --> 06:33.727
సరే. నీకేది మంచిది అనిపిస్తే, అది చేయ్.

06:33.727 --> 06:39.066
ఎంతైనా, ఇది నీ ఆపరేషన్.

06:44.029 --> 06:46.198
- కానీ నన్ను... నన్ను క్షమించు.
- పర్లేదు.

06:46.198 --> 06:49.076
- లేదు, నేను నీపై అరిచి ఉండాల్సింది కాదు.
- లేదులే. పర్లేదులే.

06:50.452 --> 06:52.704
సరే మరి, నిన్ను ఇక్కడే ఉంచకూడదు.

06:53.288 --> 06:54.373
ఎక్కడికి వెళ్లాలంటావు?

06:54.373 --> 06:56.500
ఏమో మరి. ఏదైనా సురక్షితమైన చోటుకి వెళ్లాలి.

06:56.500 --> 06:58.168
నువ్వు కిందకి వెళ్లు, నేను కాసేపట్లో వస్తా, సరేనా?

07:00.587 --> 07:03.423
- ఏం చేస్తావు?
- మనకి కొంత సమయం చిక్కేలా చేస్తా. సరేనా?

07:04.550 --> 07:05.551
మంచిది.

09:10.384 --> 09:12.469
మిక్ హెర్రన్ రాసిన స్పూక్ స్ట్రీట్
ఆధారంగా తెరకెక్కించబడింది

09:38.412 --> 09:39.538
మేడమ్.

09:39.538 --> 09:41.707
ఏదైనా ముఖ్యమైన విషయమైతే,
అది నడుస్తూ చెప్పాల్సి ఉంటుంది.

09:41.707 --> 09:43.208
నేను కోబ్రా సమావేశానికి వెళ్తున్నా.

09:43.208 --> 09:46.253
అంటే, నాకు బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి ఇంట్లో
దొరికిన అతని పాస్ పోర్ట్ ఇచ్చారు.

09:46.253 --> 09:49.006
- అన్నట్టు నా పేరు, గీతీ రెహ్మన్.
- నాకు తెలుసు.

09:50.632 --> 09:52.843
పాస్ పోర్ట్ ని పరిశీలిస్తుండగా, ఒక విషయం తెలిసింది.

09:52.843 --> 09:55.554
అది కూడా తెలుసు నాకు.
అతను పోయిన వారం ఫ్రాన్స్ నుండి వచ్చాడు.

09:56.096 --> 09:58.348
అది కాదు. ఇది అసలైన పాస్ పోర్ట్ నంబర్.

09:58.348 --> 10:00.642
- ఏదో తేడాగా ఉంది.
- ఇది నకిలీదా?

10:00.642 --> 10:02.853
- కాదు, మేడమ్.
- మరేంటి?

10:02.853 --> 10:05.480
- నాకు కూడా అదే తెలీట్లేదు.
- హా, కిందకి వస్తున్నా.

10:06.648 --> 10:07.649
మరి చెప్పేయ్.

10:09.109 --> 10:12.196
దీన్ని పాస్ పోర్ట్ ఆఫీసు వాళ్లే
చట్టబద్ధంగా రెన్యూ చేస్తూ వస్తున్నారు.

10:12.196 --> 10:15.282
మీరు ఏ సైట్ లో రాబర్ట్ వింటర్స్ కోసం చూసినా,
అంతా సవ్యంగానే కనిపిస్తుంది.

10:15.282 --> 10:17.451
పుట్టినరోజు సర్టిఫికెట్, నేషనల్ సెక్యూరిటీ నంబర్,

10:17.451 --> 10:20.621
బ్యాంక్ ఖాతా, క్రెడిట్ రేటింగ్.
ఎక్కడా ఏ అనుమానమూ రాదు.

10:20.621 --> 10:21.663
ఎక్కడ తేడా ఉంది మరి?

10:21.663 --> 10:26.001
కాకపోతే, మన సిస్టమ్స్ ప్రకారం,
ఆ పాస్ పోర్టును తొలిసారిగా జారీ చేసింది మనమే.

10:29.046 --> 10:30.255
అది అసాధ్యం.

10:30.255 --> 10:32.049
అది జారీ చేసింది, ఈ భవనంలో ఉన్నప్పుడు కాదు.

10:32.049 --> 10:34.885
ఇరవై ఎనిమిదేళ్ల క్రితం మనం ఉండిన పాత భవనం నుండి.

10:38.388 --> 10:40.390
నువ్వు ఈ విషయాన్ని ముందుగా నాకే చెప్తున్నావుగా.

10:40.891 --> 10:42.518
- అవును.
- మంచి పని చేశావు.

10:45.604 --> 10:49.399
ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు
చేసే సమయంలో, నువ్వు నా ఒక్కదానికే రిపోర్ట్ చేయాలి.

10:50.400 --> 10:52.402
నువ్వు ఒక సురక్షితమైన చోటుకు వెళ్లి,

10:52.402 --> 10:55.072
రాబర్ట్ వింటర్స్ జీవితం గురించి
మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ

10:55.072 --> 10:57.199
ఒక లిస్ట్ రూపంలో నాకు అందించాలి.

10:57.199 --> 10:58.784
అతను ఎవరో మనకి తెలియాలి.

10:58.784 --> 11:00.619
ఒకవేళ అతను మన ఏజెంటే అయితే?

11:01.328 --> 11:03.747
అయ్యుండడులే. నువ్వు నా ఆఫీసును వాడుకోవచ్చు.

11:03.747 --> 11:06.416
ముందు అక్కడ పని చేస్తూ ఉండు.
నిన్ను తీసుకెళ్లడానికి నేను ఎవరినైనా పంపిస్తా.

11:32.276 --> 11:35.821
ఫ్లైట్, నువ్వు ఒకరిని,
ఒక ఏకాంతమైన చోటుకు తీసుకెళ్లాలి.

11:36.697 --> 11:37.698
వెంటనే.

11:39.074 --> 11:43.161
నేను వెస్ట్ ఏకర్స్ షాపింగ్ మాల్
బయట ఉన్న వీధిలోనే ఉన్నాను,

11:43.161 --> 11:46.373
ఇక్కడ వాతావరణంలో
ఇంకా బాధ, విషాదం అలుముకొనే ఉన్నాయి.

11:46.874 --> 11:49.585
ఇప్పుడు నాతో రెవరెండ్ హ్యారిస్ ఉన్నారు...

11:49.585 --> 11:54.298
గార్డెన్ లో ఉన్న తన నకిలీ గుర్తింపును,
డబ్బును ఖచ్చితంగా తీయాల్సిందేనని రివర్ కి చెప్పాడు డేవిడ్.

11:56.049 --> 11:57.092
దీని గడువు ముగిసిపోయింది.

11:58.594 --> 12:01.680
ఫోటో బాగానే ఉంది. నా ఫోటో లావుగా ఉంటుంది.

12:02.264 --> 12:03.348
నువ్వు ఏదో సన్నగా ఉన్నట్టు.

12:04.308 --> 12:05.642
ఇంతకీ, సంగతేంటో చెప్పు.

12:05.642 --> 12:07.561
డాగ్స్ స్వ్కాడ్ హెడ్ కి అబద్ధం ఎందుకు చెప్పావు?

12:08.604 --> 12:10.147
రివర్, అతని ముఖాన్ని పేల్చేశాడు,

12:10.147 --> 12:12.983
తద్వారా అతను చనిపోయాడన్న నమ్మకం కలిగించి,
దర్యాప్తు చేయాలన్నది అతని ప్లాన్.

12:13.901 --> 12:17.070
- అది చెత్త ప్లానే. కానీ...
- కానీ ఏజెంట్ వివరాలను బయటపడనీయకూడదు.

12:19.239 --> 12:20.741
అతను డాలర్స్ ని తీసుకెళ్లాడు.

12:20.741 --> 12:24.328
గతం తాలూకు జ్ఞాపకాలు
పలకరిస్తున్నాయి కదా? డ్రాక్మా, లీరా.

12:24.328 --> 12:26.663
నా దగ్గర ఉన్న డబ్బంతా, ఇంకా నా ఫోన్ అతనికి ఇచ్చాను.

12:26.663 --> 12:29.374
అతను సిమ్ తీసేశాడు, కాబట్టి
ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోనే దాన్ని ఉపయోగిస్తాడు.

12:33.212 --> 12:34.213
అయితే, అతను ఎక్కడికి వెళ్లాడు?

12:35.380 --> 12:37.216
నేను అడగలేదు, అతను కూడా చెప్పలేదు.

12:37.841 --> 12:39.426
దానర్థం నీకు తెలీదని కాదు కదా.

12:44.598 --> 12:47.226
సర్లే. అతను టాయిలెట్ కి
వెళ్లినప్పుడు, నేను అతని జేబుల్లో వెతికాను.

12:47.226 --> 12:51.021
జేబుల్లో ఫ్రాన్స్ తిరుగు ప్రయాణానికి టికెట్,
లె బ్లాంక్ రుస్ అనే కెఫే బిల్,

12:51.021 --> 12:52.940
అంటే తెల్ల రష్యన్ అని అనమాట... ఏం చెప్పకు...

12:52.940 --> 12:54.942
అది లవాండ్ అనే ఊరిలో ఉంటుంది,
ఇంకా ఒక పాస్ పోర్ట్ దొరికాయి.

12:54.942 --> 12:56.818
- ఆ పాస్ పోర్ట్ లో ఏ పేరుంది?
- ఆడమ్ లాక్ హెడ్.

12:59.696 --> 13:02.324
మళ్లీ పిస్తాలా ఏదో పీకడానికి అన్నట్టు వెళ్లాడు.

13:02.824 --> 13:05.244
నా దగ్గర డేవిడ్ ని ఎందుకు
పెట్టేసి వెళ్లాడంటే, డేవిడ్ ఉన్న స్థితిలో

13:05.244 --> 13:07.538
అతని చేత ఏమైనా చెప్పించేయవచ్చు.

13:07.538 --> 13:09.873
పార్క్ కి అనుకూలంగా వాళ్లు ఏమైనా చెప్పించేసుకోవచ్చు.

13:11.041 --> 13:12.709
ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు.

13:12.709 --> 13:14.878
కానీ వచ్చాక, అయోమయంలో పడిపోయాడు.

13:15.420 --> 13:17.089
రివర్ ఎక్కడికి వెళ్లాడో అతనికి తెలుసా?

13:17.089 --> 13:20.676
తెలిసి ఉండకపోవచ్చు.
ఇతడిని కంగారుపెట్టడం రివర్ కి ఇష్టం లేదు.

13:20.676 --> 13:22.427
తొక్కేం కాదు. మనోడు కంగారుపడాలి కదా.

13:25.013 --> 13:28.350
లె బ్లాంక్ రుస్. అక్కడికి ఎప్పుడైనా వెళ్లావా?

13:28.350 --> 13:30.519
- నేను రివర్ ని చంపేశా.
- లేదులే.

13:31.311 --> 13:33.063
ఇప్పుడు రోస్ కి నేనేం సమాధానం చెప్పాలి?

13:34.690 --> 13:38.735
- ఏం చెప్పనక్కర్లేదు. తను ఎప్పుడో చనిపోయింది కదా.
- చూశావా? అతను అయోమయంలో ఉన్నాడన్నానా!

13:38.735 --> 13:41.154
రివర్ చనిపోయాడని,
తన భార్య ఇంకా బతికే ఉందని అనుకుంటున్నాడు.

13:41.822 --> 13:44.658
లవాండ్ అనే ఊరు గురించి నీకేమైనా తెలుసా?

13:46.034 --> 13:47.035
తెలీదు.

13:48.078 --> 13:50.789
నువ్వు జాక్సన్ కదా? నిన్ను చూసి చాలా కాలమైంది.

13:50.789 --> 13:53.083
హా, అవును. మహదానందంగా ఉందిలే.
లవాండ్ గురించి చెప్పు.

13:53.083 --> 13:56.170
- లవాండ్? అంటే ఫ్రెంచిలో లావెండర్ అని అర్థం.
- అవును.

13:57.588 --> 14:00.799
లావెండర్ నీలి రంగులో ఉంటుంది.
పచ్చ రంగులో ఉంటుంది.

14:02.342 --> 14:04.970
- లావెండర్ నీలి రంగులో ఉంటుంది
- ఆటలు ఆపరా, ముసలి...

14:04.970 --> 14:07.264
- పచ్చ రంగులో ఉంటుంది
- జాక్సన్. అతని ఆరోగ్యం బాలేదు.

14:07.264 --> 14:08.891
- పెద్ద షాకులో ఉన్నాడు.
- నేను రాజు అయ్యాక...

14:08.891 --> 14:11.685
తొక్కేం కాదు. మతిమరుపును
అడ్డం పెట్టుకొని ఆటలాడుతున్నాడు.

14:11.685 --> 14:14.188
- నన్ను ఇందాకే గుర్తు పట్టాడు.
- పాట ఇంకా గుర్తుంది.

14:14.188 --> 14:16.565
లవాండ్. రివర్ అక్కడికే వెళ్లాడు.

14:16.565 --> 14:18.775
లేదు. లేదు, రివర్ చనిపోయాడు.

14:18.775 --> 14:22.154
నీకు తెలిసిందేంటో నువ్వు చెప్పకపోతే,
అతను నిజంగానే చావవచ్చు.

14:22.154 --> 14:23.238
నేనెక్కడ ఉన్నాను?

14:25.240 --> 14:27.701
- ఇది ఎవరి గది?
- లేదు. నువ్వు...

14:27.701 --> 14:29.703
- డేవిడ్, నువ్వు ఒక సురక్షితమైన చోట ఉన్నావు.
- ఏంటి?

14:29.703 --> 14:31.955
- అవును. రివరే ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాడు.
- రివరా?

14:31.955 --> 14:33.665
ఇలా వచ్చి కూర్చో. రా.

14:34.833 --> 14:37.961
నాకు అంతా అయోమయంగా ఉంది.
నాకు అయోమయంగా ఉంది. నాకు...

14:41.048 --> 14:45.344
ఒకడు వచ్చాడు. రివర్ లానే ఉన్నాడు,
నేను కాల్చేశాను అతడిని.

14:45.969 --> 14:49.389
నీ జ్ఞాపకశక్తికి పదును పెట్టు.
నేనెవరో నీకు తెలుసని నాకు తెలుసు.

14:49.389 --> 14:52.976
రివర్... రివర్ ఈ పని మీదే ఒంటరిగా బయలుదేరాడు.

14:52.976 --> 14:56.563
అతను నీకు మనవడే కావచ్చు, కానీ నా ఏజెంట్ కూడా.

14:56.563 --> 15:00.108
కాబట్టి, అతను ఎవరి కోసం వెళ్లాడు, ఎందుకు వెళ్లాడు?
అసలు ఏంటి ఈ యవ్వారం?

15:00.108 --> 15:04.655
నేను అతడిని కాపాడాలనే చూశాను.
మొదట్నుంచీ కూడా నా ప్రయత్నం అదే.

15:05.822 --> 15:07.533
నేను చెప్పేది నువ్వు నమ్ముతున్నావు కదా, రోస్?

15:08.033 --> 15:10.661
చనిపోయిన 80 ఏళ్ళ మహిళ నువ్వే అనుకుంటున్నాడు.

15:10.661 --> 15:13.413
- మనోడిని ఒకటి పీకితే సెట్ అవుతాడేమో.
- కాస్త జాలి చూపించు, జాక్సన్.

15:13.413 --> 15:15.582
చూపించా. మనోడి కింద పని చేసినంత కాలం చూపించా.

15:16.667 --> 15:17.751
ఎక్కడికి వెళ్లిపోతున్నావు?

15:17.751 --> 15:20.963
అతను ఫ్రాన్స్ కి ఎప్పుడు వెళ్లాడో,
ఎందుకు వెళ్లాడో కనుగొనాలి కదా.

15:20.963 --> 15:22.047
ఈలోపు,

15:22.047 --> 15:24.550
పనికొచ్చేది ఏదైనా అతనికి గుర్తొస్తే, నాకు చెప్పు.

15:32.724 --> 15:34.393
మీకు లవాండ్ ఎక్కడో తెలుసా?

15:34.393 --> 15:35.561
తెలీదు.

15:35.561 --> 15:37.646
ఇక్కడికి యాత్రికులు పెద్దగా రారు.

15:38.397 --> 15:39.565
మీరు కూడా యాత్రకనే వచ్చారా?

15:40.065 --> 15:43.986
నేనా? లేదు. ఒక స్నేహితుడి కోసం వచ్చా.

15:43.986 --> 15:45.946
మీరు బ్రిటిష్, కదా?

15:45.946 --> 15:48.156
అవును, సారీ.

15:48.156 --> 15:51.493
మరేం పర్వాలేదులే. ఇక్కడ దింపనా?

15:52.286 --> 15:53.662
- సరే.
- సరేనా?

15:53.662 --> 15:56.748
ట్యాక్సీ - ప్యారిస్

15:58.041 --> 15:59.209
మరి...

15:59.793 --> 16:03.088
95 యూరోలు అయింది.

16:04.840 --> 16:06.216
చిల్లర ఉంచుకోండి.

16:06.216 --> 16:09.595
థ్యాంక్యూ. మీ స్నేహితుడిని కలుసుకుంటారనే ఆశిస్తున్నా.

16:09.595 --> 16:11.263
థ్యాంక్యూ. బై.

16:11.263 --> 16:12.639
రోజంతా కులాసాగా గడపండి.

16:26.820 --> 16:32.701
విశాల హృదయం, విశ్వాసం, భద్రత.
వీటిల్లో ఏ ఒక్కటి లోపించినా, మిగతావి కూడా ఉండవు.

16:34.953 --> 16:35.954
రెండు...

16:38.248 --> 16:40.626
వీటిల్లో ఏ ఒక్కటి లోపించినా,
మిగతా రెండు కూడా ఉండవు. అదన్నమాట.

16:40.626 --> 16:43.504
పొరపాట్లు దొర్లినప్పుడు మనం జవాబుదారీగా ఉండాలి.

16:43.504 --> 16:45.380
అంటే, అర్థమైందిగా, మనం బాధ్యత తీసుకోవాలి అని అర్థం.

16:46.256 --> 16:50.844
మన పని ఎక్కువ రహస్యంగానే జరుగుతుందని
నాకు తెలుసు, అది అభినందనీయమే.

16:51.345 --> 16:54.097
కానీ ఒక్కోసారి కాస్తంత పారదర్శకంగా
పని చేస్తే మేలనిపిస్తూ ఉంటుంది,

16:54.681 --> 16:57.142
ఎందుకంటే, మనం మెరుగవ్వగలిగేది అలానే.

16:57.684 --> 17:00.729
మనం మెరుగ్గా ఉన్నప్పుడే కదా,
పనులు కూడా మెరుగ్గా చేయగలం...

17:04.942 --> 17:07.986
- నువ్వు ఫోన్ ఎత్తాలనుకుంటా.
- మోగేది నా ఫోన్ కాదు.

17:07.986 --> 17:09.070
ఏంటి... అది నా...

17:10.864 --> 17:11.949
దేవుడా. నా ఫోనా?

17:12.532 --> 17:15.368
అది... అది నాదే... బాబోయ్, నాకు సిగ్గుచేటుగా అనిపిస్తోంది.

17:15.368 --> 17:17.871
నిజానికి... ఇది... ఇది కొత్త ఫోన్ అన్నమాట,
కాబట్టి నాకు...

17:18.622 --> 17:21.458
నేను టైమర్ ని సెట్ చేశాననుకున్నా,
కానీ కౌంట్ డౌన్ సెట్ అయిపోయింది.

17:21.458 --> 17:22.542
అది అందరూ చేసేదే.

17:22.542 --> 17:25.671
హా, కానీ సరిగ్గా 15 నిమిషాల్లో
అయిపోయింది. సరిగ్గా. కాబట్టి...

17:25.671 --> 17:28.089
మరి, నీ అభిప్రాయమేంటో...

17:28.089 --> 17:30.717
- సమయం సరైనది కాదనుకుంటా.
- హా, నువ్వన్నది నిజమే.

17:30.717 --> 17:33.178
- నేను సమయాన్ని తగ్గించగలను.
- నా ఉద్దేశం, ఇది సరైన సమయం కాదని.

17:34.012 --> 17:36.723
ప్రమాదాలన్నీ పొంచి ఉన్నాయి. నువ్వు వీటిపై సంతకం చేయాలి.

17:36.723 --> 17:41.103
ఇవి మృతుల కుటుంబాలకి ఓదార్పును,
అండగా ఉన్నామని తెలిపే లేఖలు.

17:41.645 --> 17:42.646
హా, తప్పకుండా.

17:45.315 --> 17:48.485
మరొక బాంబు దాడి జరగదని
ఇప్పుడిప్పుడే ఏమీ చెప్పలేమంటావా?

17:48.485 --> 17:49.987
అవును. చెప్పలేం.

17:51.071 --> 17:52.072
కొన్నిసార్లు,

17:52.072 --> 17:56.326
ఆదర్శాల ప్రకారం, పక్కా వ్యూహంతో చేసే దాడి కన్నా,
ఏ కారణమూ లేకుండా, అప్పటికప్పుడు చేసే దాడే ప్రమాదకరం,

17:56.326 --> 17:58.161
ఎందుకంటే, అప్పుడు
ఆధారాలు దొరకడం కష్టమవుతుంది.

17:58.161 --> 18:00.414
చూడు డయానా, ఈ విషయంలో
నువ్వు బాధ్యతతో ఇన్ ఛార్జీగా ఉంటూ

18:00.414 --> 18:04.418
ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా
వ్యవహరించడం బాగానే ఉంది.

18:04.418 --> 18:07.588
కానీ మున్ముందు ప్రధాన బాధ్యతలను
నేను మోసేలా వ్యవహరించాలని,

18:08.130 --> 18:11.925
మన ప్రధాన వ్యూహం అదే అయ్యుండాలని...

18:13.427 --> 18:14.595
నువ్వు... నువ్వు అర్థం చేసుకోవాలి.

18:14.595 --> 18:15.929
- అవును.
- నేను ప్రధాన పాత్రను పోషించాలి,

18:15.929 --> 18:17.681
- ఎందుకంటే, అది నాదే కాబట్టి.
- అవును.

18:17.681 --> 18:20.934
మనలో మన మాట, ఈ ఆఫీసులోని తీరుతెన్నులు

18:20.934 --> 18:23.937
గణనీయంగా మారాల్సిన అవసరం ఉంది. ఏమంటావు?

18:23.937 --> 18:28.025
గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ ప్రతిపాదన వల్లే
నాకు ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది.

18:29.651 --> 18:30.569
నాకు అర్థమైందిలే.

18:30.569 --> 18:33.530
హా, అర్థమైంది అంటున్నావు,
అంటే నా అభిప్రాయంతో నువ్వు ఏకీభవించినట్టేనా?

18:33.530 --> 18:34.990
సూత్రపరంగా అయితే ఏకీభవిస్తున్నా. నేను...

18:34.990 --> 18:38.410
అప్పటికప్పుడు పరిస్థితులకి తగ్గట్టుగా
మనం వ్యవహరించే తీరు ఈ కొత్త విధానం వల్ల మారవచ్చని

18:39.870 --> 18:42.789
నీకు చెప్తున్నానంతే.

18:42.789 --> 18:48.670
అవును. నువ్వు, అలాగే ఇతరులు కూడా కొత్త విధానాన్ని
ఆనందంగా స్వీకరిస్తారు, ఆ నమ్మకం నాకుంది.

19:00.432 --> 19:03.018
గుడ్ మార్నింగ్. నమస్తే.

19:17.491 --> 19:19.493
మన్నించాలి... క్షమించండి.

19:21.328 --> 19:24.873
మన్నించాలి... భయపెట్టినందుకు... మీ కుక్కని.

19:24.873 --> 19:28.836
'లె బ్లాంక్ రుస్' ఎక్కడుందో కాస్త చెప్పగలరా?

19:29.378 --> 19:30.379
బ్లాంక్ రుస్?

19:30.963 --> 19:33.715
ఇంకాస్త ముందుకు వెళ్తే, కూడలి దగ్గర ఉంటుంది.

19:35.092 --> 19:36.051
థ్యాంక్యూ.

19:37.511 --> 19:38.512
థ్యాంక్స్.

20:01.034 --> 20:03.370
అతనికి కూడా ఒకటి చేయవచ్చుగా? కాస్త మనతో మాట్లాడతాడేమో.

20:03.370 --> 20:04.454
నాకంత అదృష్టం అక్కర్లేదులే.

20:06.832 --> 20:10.502
వెస్ట్ ఏకర్స్ ఉదంతం కారణంగా తుపాకీ తెచ్చావా?
తర్వాత ఏం జరుగుతుందో అని కంగారుగా ఉందా?

20:12.588 --> 20:14.214
హా, అంతే అనుకో.

20:19.469 --> 20:22.306
- మళ్లీ ఆ బాటే పడుతున్నావా?
- ఏ బాట?

20:23.056 --> 20:23.891
జూదం.

20:23.891 --> 20:26.810
తుపాకీ ఉంటే జూదం ఆడుతున్నట్టేనా?

20:26.810 --> 20:27.895
నాకు తెలీదు. అంటే...

20:29.188 --> 20:31.356
నువ్వెవరికైనా బాకీ ఉన్నావేమో,
వాళ్లు నీపై బాగా ఒత్తిడి పెడుతున్నారేమో.

20:31.356 --> 20:36.528
లేదు, అలాంటిదేమీ లేదులే. నగదు సర్దుబాటు
విషయంలో ఒక చిన్న సమస్య అంతే.

20:37.654 --> 20:39.573
దేవుడా. మళ్లీ జూదం ఆడుతున్నావు నువ్వు.

20:39.573 --> 20:40.699
ఒకసారికి ఏమీ కాదులే.

20:40.699 --> 20:43.660
చూడు, మళ్లీ ఆడటం మంచి విషయమే.
పురోగతిని సూచిస్తుంది అది.

20:43.660 --> 20:44.995
- తొక్కేం కాదు.
- నిజమే చెప్తున్నా.

20:44.995 --> 20:47.122
పొద్దస్తమానం జూదం ఆడటం కన్నా,
ఒకసారి ఆడితే మేలే కదా.

20:47.122 --> 20:50.501
అంటే, సీరియల్ కిల్లరుగా ఉండటం కన్నా
ఒక హత్య మేలే కదా అన్నట్టు ఉంది నువ్వు చెప్పేది.

20:50.501 --> 20:52.794
- నేను ఎవరినీ చంపట్లేదు, కాబట్టి...
- మరి ఆ తుపాకీ ఎందుకు?

20:52.794 --> 20:55.255
- దాన్ని అమ్మేస్తాను.
- అంటే, దాన్ని అమ్మేసి,

20:55.255 --> 20:56.715
ఇతరులకు దానితో చంపే అవకాశం ఇస్తావా?

20:56.715 --> 20:59.801
చూడు, ఆ డబ్బుతో పక్కాగా డబ్బులొచ్చే
ఆట ఆడి, నా అప్పులన్నీ తీర్చేసి,

20:59.801 --> 21:01.929
అది అమ్మకానికి పోక ముందే, కొనేసుకుంటాను.

21:01.929 --> 21:04.389
- అప్పుడు ఎవరికీ ఏమీ కాదు.
- నువ్వు పిచ్చిపిచ్చిగా ఆలోచిస్తున్నావు.

21:06.183 --> 21:07.142
ఎంత అప్పు ఉన్నావు?

21:07.142 --> 21:09.269
- అది నీకు అనవసరం.
- పెద్ద అప్పే అయితే.

21:10.062 --> 21:11.355
పేపర్ క్లిప్స్ తో జూదం ఆడుతున్నటు నటించి,

21:11.355 --> 21:13.690
తెర వెనుక నిజంగానే జూదం ఆడుతున్నావుగా.

21:13.690 --> 21:16.443
- స్నేహితురాలిగా నా దగ్గరకు వచ్చుండాల్సింది నువ్వు.
- అవునా?

21:16.443 --> 21:19.446
స్నేహితురాలిగా ఉండాలనుందా?
అయితే నెలాఖరులోపు నాకు పది వేలు అప్పు ఇవ్వు.

21:19.446 --> 21:20.906
లేకపోతే, నా ఇల్లు లాగేసుకుంటారు,

21:20.906 --> 21:23.200
క్యాసీకి ఈ విషయం తెలిస్తే,
నా పెళ్లి కూడా పెటాకులవుతుంది, సరేనా?

21:23.200 --> 21:29.456
నాకు పది వేలు కావాలి,
ఒకప్పుడు డ్రగ్స్ తీసుకొనే వీరనారి నుండి లెక్చర్ కాదు.

21:41.051 --> 21:42.761
- కాఫీ తెచ్చిచ్చినందుకు థ్యాంక్స్.
- దానిలో సుసు పోశా.

21:56.567 --> 21:58.277
ఫ్రాన్స్ లోని లవాండ్ అనే ఊరు.

21:58.277 --> 22:01.071
ఆ ఊరి గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని
కనుగొనడానికి నీకు అయిదు నిమిషాలు ఇస్తున్నా,

22:01.071 --> 22:02.531
ఆ సమాచారం కూడా నాకు పనికొచ్చేది అయ్యుండాలి.

22:04.032 --> 22:05.325
అది కార్ట్ రైట్ దా?

22:05.325 --> 22:06.243
అవును.

22:06.827 --> 22:08.620
వాడు చచ్చిపోలేదురా, దద్దమ్మా!

22:10.414 --> 22:12.916
- చచ్చిపోయాడని మెసేజ్ పెట్టారు కదా.
- ఇంకోసారి చదువు దాన్ని.

22:17.838 --> 22:18.672
సరే మరి.

22:18.672 --> 22:21.967
ఆఫీసులో ఉన్న మూడంతా చెడగొట్టకు ఇక.
రివర్ ప్రస్తుతానికి ప్రాణాలతోనే ఉన్నాడు.

22:23.343 --> 22:24.803
- దేవుడా.
- ఏమన్నాడు?

22:24.803 --> 22:26.555
- ఇదేం కామెడీ!
- పక్కాగా చెప్పండి.

22:26.555 --> 22:30.100
- సరే, అతను చచ్చాడు. హ్యాపీయా?
- కాదు. అసలేం జరుగుతోందో చెప్పండి.

22:30.100 --> 22:31.935
అతను చనిపోయాడని మీరే అన్నారు కదా.

22:31.935 --> 22:33.228
దాన్ని మళ్లీ చదివావా?

22:33.228 --> 22:37.107
హా. "కాస్త ఆలస్యంగా వస్తా. రాత్రంతా
కార్ట్ రైట్ దేహాన్ని గుర్తించే పనితోనే సరిపోయింది నాకు."

22:37.107 --> 22:42.154
కార్ట్ రైట్ చనిపోయాడని అతను చెప్పలేదు.
అతను దేహాన్ని గుర్తించే పనిలో ఉన్నాడనే అన్నాడు.

22:42.821 --> 22:44.948
అయ్య బాబోయ్. మనోడు మాట్లాడాడే.
ముత్యాలు ఎక్కడైనా రాలాయా? కానీ...

22:44.948 --> 22:47.284
నోరు పూర్తిగా తెరిచి మాట్లాడుంటే రాలేవేమో.

22:47.284 --> 22:48.785
మానసికంగా నా పరిస్థితి ఏమంత బాగాలేదు.

22:48.785 --> 22:50.162
మనందరి పరిస్థితీ అదే.

22:50.162 --> 22:52.539
నోర్మూసుకో. రివర్ చనిపోయాడు అన్నప్పుడు
నువ్వు అస్సలు పట్టించుకోలేదు.

22:52.539 --> 22:55.083
- నేను మనోవేదనతో ఉన్నాను.
- మూసేయ్. నోరు మూసేయ్.

22:55.083 --> 22:56.752
- వెస్ట్ ఏకర్స్ దాడిలో చచ్చుండే వాడిని.
- నాకు...

22:56.752 --> 22:58.545
- నువ్వు చాలా దూరంలో ఉన్నావు.
- దొబ్బేయ్.

22:58.545 --> 23:00.881
- లేదు, నేను ప్రాణాలతో బయటపడ్డాను.
- మా కర్మ కొద్దీ.

23:00.881 --> 23:01.965
మరి చనిపోయింది ఎవరు?

23:01.965 --> 23:08.055
అతని తాతని చంపమని పంపించబడిన వ్యక్తి.
అతను చూడటానికి రివర్ లానే ఉంటాడు.

23:08.055 --> 23:10.349
రివర్ తన గుర్తింపులని ఆ శవం దగ్గర పెట్టాడు.

23:10.349 --> 23:11.975
రివర్ లాగా ఉండేవాడు... ఒకడున్నాడా?

23:11.975 --> 23:13.894
హా, కానీ ఇప్పుడు లేడులే.

23:13.894 --> 23:17.314
తనే చనిపోయాడని అనిపించేలా చేయడానికి,
రివర్ అతని మూఖాన్ని కాల్చేశాడు.

23:17.314 --> 23:19.024
వావ్. ఫోటోలు ఏమైనా తీశారా?

23:19.024 --> 23:21.276
కానీ, అతను చనిపోయినట్టు
మమ్మల్ని ఎందుకు నమ్మించాలనుకున్నారు?

23:21.276 --> 23:26.740
ఎందుకంటే, అతను పని మీద తిరుగుతున్న ఏజెంట్,
అలాంటప్పుడు అతని వివరాలను బయటపడనీయకూడదు.

23:30.160 --> 23:32.788
ఏజెంట్ వివరాలను బయటపడనీయకూడదు!

23:32.788 --> 23:34.581
పార్క్ వాళ్లు, తను చనిపోయినట్టే అనుకోవాలని రివర్ ప్లాన్.

23:34.581 --> 23:35.999
మీరు దాన్నే కొనసాగిస్తున్నారు.

23:35.999 --> 23:38.252
మీరందరూ ఆ వాదనని నమ్మడం వల్ల,
దానికి ఇంకా బలం లభిస్తుంది.

23:38.919 --> 23:42.589
అతని ఆత్మీయులకు సంతాపసూచకంగా
సందేశాలు పంపి ఉంటారనే ఆశిస్తున్నా.

23:42.589 --> 23:43.674
అలా ఎవరూ చేయలేదు.

23:44.591 --> 23:47.010
లేదులే. అతని అమ్మకి నేను ఒక మెసేజ్ పంపాను.

23:47.010 --> 23:49.930
- తిరిగి ఆమె కాల్ చేయలేదా?
- లేదు. ఇంకా చేయలేదు.

23:49.930 --> 23:52.516
అయితే, బయటి వాళ్లకి కూడా తెలుసన్నమాట. మంచిదే.

23:52.516 --> 23:54.226
సరే. మరి తను ఎక్కడ ఉన్నాడు?

23:54.226 --> 23:58.021
ఫ్రాన్స్ కి వెళ్లాడు, హంతకుడు ఎక్కడి నుంచి
వచ్చాడో తెలుసుకొనే పని మీద ఉన్నాడు.

23:58.021 --> 23:59.189
ఫ్రాన్స్ చాలా పెద్దది.

24:01.733 --> 24:04.820
పనికొచ్చే విషయం చెప్పావు, మగాడా.
ఎవరైనా అతనికి బహుమానం ఇవ్వవచ్చుగా!

24:04.820 --> 24:07.030
- మరి డేవిడ్ ఎలా ఉన్నాడు?
- క్షేమంగానే ఉన్నాడు.

24:07.030 --> 24:09.533
సరే. రివర్ కి సాయంగా మేమేం చేయవచ్చు?

24:10.784 --> 24:12.119
అతని పనేదో అతడినే చూసుకోనిద్దాం.

24:13.245 --> 24:17.457
సరే. అతను ఫ్రాన్స్ లో ఎక్కడికి వెళ్లాడు?
ఏమీ చేయకుండా ఇక్కడే కూర్చొని ఉండాలా?

24:17.457 --> 24:21.336
అవును, అంతే. సాయం కావాలంటే, అడిగి ఉండేవాడే కదా.

24:21.336 --> 24:24.089
హా. అతని కంప్యూటరుని
నేను మళ్లీ అతనికి ఇచ్చేది లేదు.

24:49.364 --> 24:51.742
మిస్టర్ ల్యాంబ్, మిమ్మల్ని కలవడం సంతోషం.

24:52.326 --> 24:54.244
మీ గదిని శుభ్రం చేద్దామని
ఇలా మీ అనుమతి లేకుండానే వచ్చాను.

24:55.746 --> 24:58.457
చాలా శుభ్రం చేయాల్సి వచ్చింది.
మీకు అభ్యంతరం లేదనే అనుకుంటున్నా.

24:59.583 --> 25:01.168
రూపురేఖలన్నీ మారిపోయాయి.

25:02.920 --> 25:04.505
నీలో ఉత్సాహం ఉరకలేస్తున్నట్టుందే.

25:04.505 --> 25:07.382
చురుగ్గా పని చేయడం నా అలవాటు,
అందుకే నన్ను ఇక్కడికి పంపారు.

25:08.592 --> 25:09.843
అందుకే కదా?

25:09.843 --> 25:12.429
"శక్తిమంతమైన మేనేజర్ కావాలి,"
అని మిస్టర్ వీలన్ చెప్పి పంపించాడు.

25:12.429 --> 25:15.098
మిస్టర్ వీలన్, కానీ... అతను చెప్పింది నిజమేలే.

25:16.141 --> 25:18.352
నేను లంచ్ కి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావా?

25:19.978 --> 25:22.481
మీ మంచితనం చూపారు. నేను కోట్ తీసుకొని వస్తా.

25:24.066 --> 25:27.319
మిగతా భవనాన్ని చక్కగా సర్దడం గురించి
మనం మాట్లాడుకోవచ్చు.

25:27.819 --> 25:28.987
హా, మంచి ఐడియా.

25:33.867 --> 25:36.119
అంత చక్కగా ఉంటే, నేను చచ్చిపోతా.

25:36.119 --> 25:37.871
ఎలా ఉండేదో, అలాగే చేయండి.

25:42.626 --> 25:44.628
- నేను సిద్ధం.
- పదండి.

26:01.019 --> 26:02.771
- భోజనం.
- థ్యాంక్స్.

26:05.691 --> 26:08.235
టీ కూడా ఇస్తారా? రెండు స్పూన్స్ చక్కెర వేయండి.

26:12.865 --> 26:13.907
మేడమ్.

26:13.907 --> 26:15.075
ఫోన్ తనకి ఇవ్వు.

26:21.582 --> 26:23.333
- హలో.
- ఏదో సాంకేతిక లోపం వల్ల నీకలా కనిపించింది.

26:25.502 --> 26:27.337
- అయితే అది మంచిదే అనుకుంటా.
- చాలా మంచిది.

26:27.337 --> 26:33.594
మనం రాబర్ట్ వింటర్ పేరు మీద నకిలీ ఐడీని
రూపొందించాం, అది కూడా 30 ఏళ్ళ క్రితం.

26:34.428 --> 26:36.263
అది రాబర్ట్ వింటర్స్ ది కాదులే.

26:37.222 --> 26:39.850
అయితే, రాబర్ట్ వింటర్స్ తో,
వెస్ట్ ఏకర్స్ తో మనకేమీ సంబంధం లేదు కదా?

26:39.850 --> 26:43.103
అస్సలు లేదు. అతని గురించి మన సిస్టమ్ లో ఏమీ లేదు.

26:43.103 --> 26:45.355
కానీ థ్యాంక్యూ, గీతీ. నా ఉద్దేశం...

26:45.355 --> 26:49.109
ఇది కానీ బయట పడుంటే, పరిస్థితి చాలా దారుణంగా ఉండేది...

26:49.109 --> 26:50.986
తప్పుగా అర్థం చేసుకొనే వాళ్లు.

26:50.986 --> 26:53.405
- థ్యాంక్యూ, మేడమ్.
- ఫోన్ ఫ్లైట్ కి ఇవ్వు.

26:54.031 --> 26:54.865
ఫ్లైట్.

27:00.329 --> 27:02.080
- మేడమ్.
- ఇక తనని నువ్వు పంపించేయవచ్చు.

27:03.332 --> 27:05.459
సగౌరవంగా చెప్తున్నా,
నాకు ఆయా పని కాక, ఇంకేదైనా చెప్పండి.

27:06.126 --> 27:08.212
నీకు అనుక్షణం సంతృప్తి దక్కలేకపోతున్నందుకు

27:08.212 --> 27:10.547
నాకు చాలా బాధగా ఉంది, కానీ ఈ పని అలానే ఉంటుంది.

27:10.547 --> 27:13.300
ఇక కార్ట్ రైట్ సంగతి చూడు,
లేదా అది కూడా నువ్వు చేయాల్సింది కాదంటావా?

27:13.300 --> 27:14.468
లేదు, మే...

27:27.105 --> 27:29.107
లె బ్లాంక్ రుస్

27:48.418 --> 27:49.419
గుడ్ మార్నింగ్.

27:51.171 --> 27:52.172
గుడ్ మార్నింగ్.

27:55.092 --> 27:57.094
కాఫీ ఇవ్వరా!

28:07.354 --> 28:08.605
మీకు ఇంగ్లీష్ వచ్చా?

28:10.107 --> 28:11.275
రాదు.

28:14.611 --> 28:17.656
నాలానే... ఉండే ఒక వ్యక్తి...

28:18.448 --> 28:22.452
ఇక్కడికి కొన్ని రోజుల క్రితం వచ్చాడు.

28:23.453 --> 28:24.288
అవును.

28:24.288 --> 28:25.706
- నాకు అతను తెలుసు.
- తెలుసా?

28:26.206 --> 28:27.541
అవును.

28:29.168 --> 28:31.753
అతని ఇల్లు ఇక్కడే ఉందా?

28:31.753 --> 28:33.255
లేదు, లేదు.

28:33.255 --> 28:35.007
లవాండ్ లో అయితే లేదు.

28:35.007 --> 28:36.550
అతను లెస్ ఆబ ప్రాంతానికి చెందిన వాడు.

28:36.550 --> 28:38.302
- లెస్ ఆబనా? హా.
- లెస్ ఆబ. అవును.

28:39.052 --> 28:40.512
అది ఎక్కడ?

28:41.680 --> 28:44.808
నేరుగా మూడు కిలోమీటర్లు వెళ్లండి,
అక్కడ అడవిలో ఉంటుంది.

28:45.559 --> 28:46.560
సరే.

28:48.896 --> 28:49.897
థ్యాంక్యూ.

29:11.084 --> 29:12.836
అతను వచ్చాడు.

29:13.795 --> 29:15.839
లెస్ ఆబ వైపు వెళ్తున్నాడు.

29:15.839 --> 29:17.674
అతనిపై ఓ కన్నేసి ఉంచుతా.

29:30.270 --> 29:32.105
ఈ మిస్టరీ థ్రిల్లర్ కి క్షమించు.

29:34.233 --> 29:35.609
నిజానికి, ఇది భలే గమ్మత్తుగా ఉంది.

29:35.609 --> 29:39.112
నాకు గమ్మత్తుగా ఉంది, ఎందుకంటే, నీకు తెలుసో లేదో,

29:39.112 --> 29:41.532
నేను... నేను ఫీల్డ్ లో పని చేయడం ఇదే మొదటిసారి.

29:43.909 --> 29:47.371
అంటే, ఇంత... ఇంత అవసరం ఏంటి?

29:47.371 --> 29:49.831
కొన్ని సంభాషణలు రహస్యంగా జరిగితేనే మంచిది.

29:49.831 --> 29:50.916
అవునులే.

29:53.377 --> 29:54.962
ఏంటి... మనం ఎక్కడికి వెళ్తున్నాం?

29:56.296 --> 29:58.841
బస్సులో ఎక్కడికైనా. ఈ బస్సు ఎక్కుదాం, పద.

30:02.094 --> 30:03.929
ఒకప్పుడు రాబర్ట్ వింటర్స్ మన ఏజెంటే.

30:03.929 --> 30:07.766
దేవుడా. అతను ఒకప్పుడు మన ఏజెంటా?

30:08.267 --> 30:09.893
- ఏజెంట్ అని కాదు.
- అయితే, మన ఇన్ఫార్మరా?

30:09.893 --> 30:12.312
కోల్డ్ వార్ చివర్లో ఉన్నప్పుడు
మనం తయారు చేసిన కోల్డ్ బాడీ అన్నమాట.

30:12.312 --> 30:13.772
కోల్డ్ బాడీ అంటే?

30:13.772 --> 30:15.732
అంటే గుర్తింపు పత్రాలు అన్నమాట.

30:16.358 --> 30:20.320
పుట్టినరోజు సర్టిఫికెట్,
పాస్ పోర్ట్, నేషనల్ ఇన్సురెన్స్ నంబర్,

30:20.320 --> 30:22.197
బ్యాంక్ ఖాతా, క్రెడిట్ రేటింగ్.

30:22.197 --> 30:23.490
అలా అని నకిలీవి అనుకోకు.

30:23.490 --> 30:26.702
అధికారిక ఛానెళ్లలో ఉండే నిజమైన పత్రాలు.

30:26.702 --> 30:29.246
ఇప్పుడైతే, అంతా ఆన్ లైన్ లో జరిగిపోతుంది,
ఆ రోజుల్లో ఇదొక కళ అని చెప్పవచ్చు.

30:29.246 --> 30:31.999
సారీ, దీని గురించి నీకెంత కాలంగా తెలుసు?
ఈ విషయం నీకు ఎవరు చెప్పారు?

30:31.999 --> 30:33.083
నా సిబ్బందిలో ఒకరు అయిన,

30:33.750 --> 30:36.503
- గీతీ రెహ్మన్, కొన్ని గంటల క్రితం చెప్పింది.
- గీ... నాకు...

30:36.503 --> 30:39.006
ఏదో పొరపాటు వల్ల అలా జరిగిందని,
దాన్ని పట్టించుకోవద్దని తనకి చెప్పాను.

30:39.756 --> 30:41.008
అది పొరపాటే.

30:41.008 --> 30:44.428
ఇది నీకు తెలియగానే నాకు చెప్పుండాల్సింది.

30:44.428 --> 30:46.221
చెప్పుంటే, ఏం చేసుండే వాడివి?

30:47.764 --> 30:49.016
ప్రధాన మంత్రికి చెప్పుండే వాడిని.

30:49.850 --> 30:54.605
ఒక నర హంతకుడు ఎంఐ5 గుర్తింపును ఎలా
వాడగలిగాడో కనిపెట్టేందుకు, ఒక దర్యాప్తు బృందాన్ని

30:54.605 --> 30:57.024
- ఏర్పాటు చేసుండే వాడిని.
- హా, నువ్వు అలా చేస్తావనే అనుకున్నా.

30:57.024 --> 30:59.651
- అప్పుడు కానీ మన కొంప కొల్లేరు కాదు.
- ఇప్పుడు కొంప కొల్లేరే అయింది, డయానా.

30:59.651 --> 31:01.862
లేదు, ఎందుకంటే నేను రికార్డులని చెరిపివేశాను.

31:01.862 --> 31:04.198
మన భవనంలో రాబర్ట్ వింటర్స్ పేరు మీద ఉండే

31:04.198 --> 31:05.782
- ప్రతీ దాన్ని, చెరిపివేశాను.
- ఓరి దేవుడా.

31:06.617 --> 31:10.621
లేదు. ఇలాంటి దాన్ని మనం కప్పిపుచ్చకూడదు.అది నీకూ
తెలుసు. ఇస్తాంబుల్ ఉదంతంలో ఏం జరిగిందో తెలుసు కదా.

31:10.621 --> 31:13.624
అందుకే, దీన్ని కప్పిపుచ్చుతున్నా.

31:13.624 --> 31:15.459
దీనిలో కొంచెం సమాచారం బయటపడినా,

31:15.459 --> 31:18.670
సెక్యూరిటీ సర్వీసులపై ఉన్న
కాస్తంత నమ్మకం కూడా తునాతునకలైపోతుంది.

31:18.670 --> 31:21.340
క్షమించు, దీన్ని నేను దాచలేను. దాచను కూడా.

31:21.340 --> 31:22.841
క్లాడ్.

31:29.014 --> 31:30.015
ఏంటిది?

31:30.516 --> 31:33.143
గీతీ రెహ్మన్ ని ఏకాంత చోటుకు తీసుకెళ్లి
పని చేయించవలసిందిగా ఇవాళ ఉదయం

31:33.143 --> 31:34.811
నువ్వు సంతకం చేసి ఇచ్చిన ఆదేశపత్రం.

31:36.063 --> 31:38.065
అంటే, నువ్వు కూడా
ఈ కప్పిపుచ్చే యవ్వారంలో భాగమే అన్నట్టు లెక్క.

31:42.486 --> 31:43.487
అవును, కానీ నేను...

31:45.489 --> 31:47.491
నేను దీన్ని చదవనే లేదు.

31:48.283 --> 31:51.578
చదవలేదు. కానీ సంతకం చేశావుగా.

31:52.704 --> 31:56.583
వింటర్స్ పత్రాలను నాశనం చేయడంలో సాయపడ్డావు.

31:57.167 --> 31:59.169
నాకు ఈ పదవి దక్కిందని
మనస్సులో ఉంచుకొని ఇదంతా చేస్తున్నావా?

31:59.878 --> 32:01.922
నిన్ను కాదని ఈ పదవి నాకు ఇచ్చారని ఇలా చేస్తున్నావా?

32:01.922 --> 32:03.298
అందుకేనా ఇలా చేస్తున్నావు?

32:03.298 --> 32:05.759
నేనేమీ ఈ పదవికి దరఖాస్తు చేసుకోలేదు.

32:05.759 --> 32:11.348
అవును. నీకు ఇది దక్కదని తెలుసు, కదా?

32:11.348 --> 32:13.058
అందుకే నువ్వు దరఖాస్తును ఉపసంహరించుకున్నావు.

32:13.934 --> 32:15.727
అయినా కానీ, ఇప్పుడు ఆ పని నేనే చేస్తున్నా కదా.

32:17.563 --> 32:20.691
నిఘా సంస్థను నడపడానికి
పెద్ద లక్ష్యాలు, చిన్న లక్ష్యాలు అంటూ ఏమీ ఉండవు.

32:20.691 --> 32:23.193
ప్రతి రోజు సమస్యలను
వేగంగా పరిష్కరించాల్సి ఉంటుంది, అంతే.

32:23.193 --> 32:25.237
నాకేమో ఒత్తిడి పెరిగిపోయి,
అది పనితీరుపై ప్రతికూల ప్రభావం...

32:25.237 --> 32:27.614
- నీ అభిప్రాయం నాకు అనవసరం.
- ...చూపుతుందేమో అనిపిస్తోంది.

32:28.282 --> 32:31.118
మరొక వెస్ట్ ఏకర్స్ ఉదంతం జరగకూడదు,
నా లక్ష్యం అదే.

32:32.035 --> 32:37.207
జనాల ముందు పిస్తా అనిపించుకోవాలనే
నీ కోరిక, ఆ పనికి అడ్డు పడుతుంది.

32:37.207 --> 32:40.127
హా, నీ ఉద్యోగం పోకూడదు, అంతే కదా నీకు కావాల్సింది?

32:40.127 --> 32:44.339
- అవును. అందులో నేను నిష్ణాతురాలిని.
- అవునా?

32:45.507 --> 32:47.092
తర్వాతి స్టాపులో దిగేయ్.

32:54.725 --> 32:57.227
నమస్తే, సర్. మీరు నాకు సాయపడగలరా?

32:58.312 --> 33:03.859
నేను సిసింగ్ హర్స్ట్... హర్స్ట్
వెళ్లాలి. తోటలు ఉంటాయే, ఆ చోటు.

33:03.859 --> 33:06.653
అయ్యయ్యో. అది ఉండేది ఇటు వైపు కాదు.
టన్ బ్రిడ్జ్ వెల్స్ కి అటు వైపు ఉంటుందది.

33:06.653 --> 33:09.489
మీరు మెయిన్ రోడ్డు ఎక్కి,
పట్టణానికి వెళ్లే ఎడమ మలుపు తీసుకోవాలి.

33:09.489 --> 33:11.491
అక్కడ సైన్ బోర్డులు ఉంటాయి.

33:11.491 --> 33:13.535
ఇలా వస్తే షార్ట్ కట్ లో వెళ్లవచ్చని అనుకున్నా.

33:13.535 --> 33:15.412
లేదు, లేదు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ.

33:15.996 --> 33:17.164
ఏమైంది ఇక్కడ?

33:17.915 --> 33:20.417
మీరు పహారా ఏమైనా కాస్తున్నారా?

33:20.417 --> 33:21.919
ఇక్కడొక దుర్ఘటన జరిగింది.

33:22.711 --> 33:26.423
ఓరి దేవుడా. నేనుండే గెస్ట్ హౌస్ లోని
మహిళ దీని గురించే చెప్పింది.

33:26.423 --> 33:29.092
ఒక పెద్దాయన్ని కాల్చారట. దారుణం.

33:29.843 --> 33:31.220
అది కూడా ఇలాంటి చోట.

33:31.762 --> 33:33.847
నిజానికి, చనిపోయింది అతని మనవడు.

33:36.016 --> 33:37.267
పసి ప్రాణమా?

33:38.352 --> 33:41.772
అది ఇంకా దారుణం.
కుటుంబం చాలా బాధ పడుతూ ఉంటుంది.

33:43.524 --> 33:44.733
కలికాలం, కదా?

33:46.109 --> 33:47.945
సరే మరి, థ్యాంక్యూ. రోజంతా కులాసాగా గడపండి.

34:11.385 --> 34:12.636
చెప్పు.

34:12.636 --> 34:13.971
డేవిడ్ ఇంకా బతికే ఉన్నాడు.

34:13.971 --> 34:16.389
అతను మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు తెలీడానికి,
ఒక కెమెరాని అమర్చాను.

34:17.641 --> 34:19.434
అతని మనవడు చనిపోయాడని అంటున్నారు,

34:19.434 --> 34:21.978
కానీ అది బెర్ట్ రాండ్ కావచ్చు. అతని ఫోన్ కలవట్లేదు.

34:21.978 --> 34:26.233
బెర్ట్ రాండ్ తిరిగి ఫ్రాన్స్ కి
వస్తున్నాడు, అతని పాస్ పోర్ట్ పింగ్ అయింది.

34:26.233 --> 34:28.443
అన్నింటినీ తుడిచేస్తూ,
అతని కోసం ఇక్కడ ఎదురు చూస్తుంటా.

34:28.443 --> 34:32.072
ఒకవేళ అతను కాకపోతే?
ఆ వచ్చేది కార్ట్ రైట్ మనవడు అయితే?

34:32.072 --> 34:33.991
అతనే కనుక వస్తే, అతని సంగతి చూసేస్తాలే.

34:34.658 --> 34:36.409
నువ్వు ఇంకో టార్గెట్ పని చూడు.

34:36.409 --> 34:37.494
ఇంకో ముసలాయన.

34:38.328 --> 34:40.539
డేవిడ్ కార్ట్ రైట్ లా అతను
ఇబ్బంది పెట్టకుంటే బాగుంటుంది.

34:40.539 --> 34:42.623
భలేవాడివే, అతను కార్ట్ రైట్ దగ్గర
చాలా ఏళ్లు పని చేశాడు.

34:42.623 --> 34:45.460
కార్ట్ రైట్ కి జరిగినది అతనికి తెలిసి ఉంటే,
కంగారుపడి జాగ్రత్తపడతాడు.

34:45.460 --> 34:46.545
హా. ఆ అవకాశం ఉంది.

34:47.420 --> 34:51.550
కానీ అతను మర్చిపోయి ఉండవచ్చు. అసలు అతడిని
చంపడానికి గల కారణమేంటో కూడా తెలిసి ఉండకపోవచ్చు.

36:26.144 --> 36:29.106
నాకు చికెన్ బిర్యానీ, ఇంకా హౌస్ రెడ్ వైన్ తీసుకురండి.

36:29.773 --> 36:31.483
నేనేమీ తాగనులే.

36:31.984 --> 36:33.819
అయితే, హౌస్ రెడ్ వైన్ ఒకటి తీసుకురండి, చాలు.

36:35.070 --> 36:36.071
థ్యాంక్స్.

36:38.866 --> 36:41.368
పార్కులో, నీకు అన్ని చోట్లకూ యాక్సెస్ ఉండేది, కదా?

36:41.368 --> 36:43.954
అక్కడ నీ హోదా, డేటాబేస్ క్వీన్ కదా.

36:43.954 --> 36:45.038
అవును.

36:45.831 --> 36:48.375
ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలీకపోతే,
ఆ సమాధానం ఎవరు ఇవ్వగలరో నాకు తెలుసు.

36:49.418 --> 36:52.588
స్లౌ హౌసుకి వచ్చావంటే, కాస్త హోదా తగ్గినట్టే కదా?

36:52.588 --> 36:56.008
నాకు అలా అనిపించట్లేదు. ప్రతీ చోటా సవాళ్లు ఉంటాయి.

36:56.008 --> 37:00.637
నిన్ను ఇక్కడికి స్వయంగా వీలనే పంపాడు, కదా?

37:00.637 --> 37:02.890
- పారదర్శక బిడ్డ.
- అవును.

37:02.890 --> 37:06.935
అతను చేరీ చేరగానే నన్ను ఎంచుకున్నాడు.
నాలోని ప్రతిభని గమనించాడు అనుకుంటా.

37:06.935 --> 37:09.021
ఇక సన్నాసులైన మమ్మల్ని చక్కదిద్దేశాక ఏం చేస్తావు?

37:09.021 --> 37:11.231
మళ్లీ పార్కులోని నీ పదవి నీకు ఇచ్చేస్తారా?

37:11.231 --> 37:13.609
మిమ్మల్ని సన్నాసులంత పెద్ద మాట అననులే.

37:13.609 --> 37:14.693
నిజంగానా?

37:15.485 --> 37:20.574
హో, మార్కస్ లాంగ్రిడ్జ్, షర్లీ డాండర్.
ఓ ముగ్గురి పేర్లు చెప్పా, నువ్వే ఆలోచించు.

37:20.574 --> 37:24.203
నిజానికి, సన్నాసులనే పదం కాస్త చిన్నది అవుతుందేమో.

37:26.830 --> 37:28.498
వీళ్ల మధ్య తిరిగితే

37:28.498 --> 37:31.919
నీ పేరు చెడిపోతుందని నీకెప్పుడూ అనిపించలేదా?

37:31.919 --> 37:33.003
అనిపించలేదు.

37:35.839 --> 37:38.091
- నేను వేరులే.
- ఎలా వేరో చెప్పు మరి.

37:40.093 --> 37:42.471
నువ్వు ప్రత్యేకం అని నీకు నువ్వు
ఎందుకు చెప్పుకుంటున్నావో నాకర్థమైంది,

37:42.471 --> 37:44.723
ఎందుకంటే, వాస్తవాన్ని అంగీకరించడం చాలా కష్టం.

37:44.723 --> 37:47.267
కానీ ఎవరినైనా స్లౌ హౌస్ కి పంపించారంటే,
దానికి రెండే కారణాలు ఉంటాయని

37:47.267 --> 37:48.852
నీకు తెలుసు అనుకుంటా.

37:49.770 --> 37:53.607
మొదటిది, వాళ్లు పనికిమాలిన సన్నాసులు అయ్యుండాలి.
నువ్వు అన్నట్టు, నువ్వు అలాంటి దానివి కాదు.

37:53.607 --> 37:55.776
అంటే, నా ఆఫీసును చాలా చక్కగా సర్దావు నువ్వు.

37:55.776 --> 38:00.489
కానీ, మళ్లీ నువ్వు నా ఆఫీసులోకి అడుగు పెట్టకు.

38:01.323 --> 38:04.034
రెండవ కారణం,
వాళ్లు ఎవరికో పిచ్చ కోపం తెప్పించి ఉండాలి.

38:04.034 --> 38:05.118
కాబట్టి, మనం ఓ అంగీకారానికి వద్దాం.

38:08.455 --> 38:12.668
నా దగ్గరికి నిన్ను ఎందుకు పంపారో నేను కనుక్కుంటా,

38:14.127 --> 38:16.421
ఆ తర్వాత నువ్వు మళ్లీ పార్క్ కి దొబ్బేయవచ్చు.

38:16.421 --> 38:17.714
దానికి బదులుగా,

38:18.549 --> 38:22.302
డేటాబేస్ లో ఉండే నీ మిత్రులకి నువ్వు కాల్ చేసి,

38:22.302 --> 38:24.972
డేవిడ్ కార్ట్ రైట్, తన అద్భుతమైన కెరీర్ లో
ఎప్పుడైనా ఫ్రాన్స్ కి వెళ్లాడా, ఒకవేళ వెళ్తే

38:24.972 --> 38:27.516
ఎప్పుడు, ఎందుకో కనుక్కొని చెప్పు.

38:33.689 --> 38:35.357
- సరే.
- హా.

43:02.291 --> 43:04.293
రాబర్ట్ వింటర్స్. అయ్య బాబోయ్.

43:56.386 --> 43:57.387
దగ్గరికి రాకు!

43:58.347 --> 43:59.473
దగ్గరికి రాకు!

44:19.243 --> 44:20.244
థ్యాంక్స్.

46:06.183 --> 46:08.185
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్
