WEBVTT

01:25.169 --> 01:26.378
హలో!

01:29.214 --> 01:30.883
కాపాడండి!

01:30.883 --> 01:32.342
ఎవరైనా ఉన్నారా?

01:47.733 --> 01:50.277
అయ్య బాబోయ్! శాంతించండి.

01:51.361 --> 01:52.613
హా. సరే.

01:54.114 --> 01:55.616
ఇంతకీ ఎవరు మీరు?

01:56.116 --> 01:57.743
నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు?

01:57.743 --> 01:59.912
నన్ను తలపై ఎందుకు కొట్టారు?

01:59.912 --> 02:01.079
అది అవసరమా?

02:05.792 --> 02:07.169
ఎవరు మీరు?

02:08.419 --> 02:09.795
ఏం చేస్తున్నారు?

02:11.965 --> 02:13.509
మీరు ఫ్రెంచి వారా?

02:13.509 --> 02:15.636
నీతో మాట్లాడటానికి ఒకరు వస్తున్నారు.

02:16.929 --> 02:18.388
ఎవరు? నాతో మాట్లాడటానికి ఎవరు వస్తున్నారు?

02:19.389 --> 02:21.308
బాబోయ్. సరే. సరే.

02:21.808 --> 02:23.185
నాతో మాట్లాడటానికి ఎవరు వస్తున్నారు?

02:27.105 --> 02:28.398
మీరు నా ఫోన్ తీసుకున్నారా?

02:29.233 --> 02:30.442
మీరు... ఆగండి, ఆగండి!

02:32.569 --> 02:35.656
కాస్త... అబ్బా.

02:36.490 --> 02:37.699
అబ్బా!

02:43.956 --> 02:45.666
ఛ.

03:21.451 --> 03:23.704
మిక్ హెర్రన్ రాసిన స్పూక్ స్ట్రీట్ పుస్తకం
ఆధారంగా తెరకెక్కించబడింది

03:35.465 --> 03:39.094
డేవిడ్, ఇంకో కప్పు టీ తీసుకొచ్చా.

03:41.013 --> 03:42.931
ఇది నీకు కావాల్సినంత
స్ట్రాంగ్ గానే ఉంటుందని ఆశిస్తున్నా.

03:45.100 --> 03:47.853
చార్ల్స్ కి టీ కొంచెం కూడా స్ట్రాంగ్ గా
ఉండకూడదు, నేను అతనితో

03:48.687 --> 03:50.814
"పాలలో రవ్వంత టీ పొడి వేయనా?" అని అడిగే దాన్ని.

03:52.274 --> 03:53.692
నీకు చార్ల్స్ గుర్తున్నాడా?

03:55.944 --> 03:57.237
డేవిడ్?

03:57.237 --> 03:58.405
నేను అతడిని చంపేశాను.

03:59.364 --> 04:01.074
- రివర్ ని.
- లేదు.

04:01.575 --> 04:04.620
లేదు, రివర్ లా ఉండే వేరే వ్యక్తిని
చంపావు నువ్వు. మర్చిపోయావా?

04:06.371 --> 04:08.207
అతనిలా ఉండే వేరే వ్యక్తినా?

04:10.167 --> 04:12.211
దేవుడా, నేను ఎంత పని చేశాను?

04:12.211 --> 04:14.755
డేవిడ్, నువ్వు ఆత్మరక్షణలో భాగంగానే
అతడిని కాల్చాల్సి వచ్చింది.

04:16.882 --> 04:21.011
లేదు, నేను ఆ పని రివర్ కోసం చేశాను.

04:22.596 --> 04:24.890
అతడిని కాపాడటానికి. రివర్ ని కాపాడటానికి.

04:26.850 --> 04:27.893
ఎక్కడ ఉన్నాడు అతను?

04:31.230 --> 04:32.773
నా మనవడు ఎక్కడ?

04:33.899 --> 04:35.442
నన్ను ఇక్కడ ఎందుకు వదిలేసి వెళ్లాడు?

04:35.943 --> 04:36.944
డేవిడ్?

04:39.321 --> 04:40.322
నువ్వు ఎవరు?

04:41.031 --> 04:42.658
నా పేరు క్యాథరిన్ స్టాండిష్.

04:42.658 --> 04:44.535
ఒకప్పుడు నేను రివర్ సహోద్యోగిని.

04:44.535 --> 04:47.579
అంతకముందు, చార్ల్స్ పార్టనర్ దగ్గర పని చేశాను.

04:48.539 --> 04:50.499
లేదు. లేదు, నువ్వెవరో నాకు గుర్తు లేదు.

04:52.292 --> 04:53.710
నీకు చార్ల్స్ తెలుసా?

04:53.710 --> 04:55.712
- తెలుసు. నేను అతనికి పీఏగా పని చేశా.
- నేను...

04:55.712 --> 04:57.965
ఆ తర్వాత జాక్సన్ కి పీఏగా పని చేశా.

04:59.883 --> 05:00.884
బాంబు.

05:02.261 --> 05:03.470
ఆ జనాలందరూ.

05:04.638 --> 05:07.474
- పాపం, ఆ జనాలు.
- లేదు, డేవిడ్. బాంబుకు, నీకు ఏ సంబంధమూ లేదు.

05:08.892 --> 05:10.018
డేవిడ్.

05:14.565 --> 05:17.025
- నేను ఫస్ట్ డెస్క్ తో మాట్లాడాలి.
- నువ్వు పార్కుకు వెళ్లకూడదు.

05:17.025 --> 05:18.569
- రివర్ కి అది ఇష్టముండదు.
- లేదు.

05:18.569 --> 05:19.862
- నాపై నుండి చేతులు తీయ్.
- లేదు, డేవిడ్.

05:19.862 --> 05:22.155
- నన్ను తాకవద్దు!
- క్షమించు.

05:22.155 --> 05:23.991
నేను ఫస్ట్ డెస్కుతో మాట్లాడాలి.

05:23.991 --> 05:26.159
ఏం జరిగిందో వాళ్లకి నేను చెప్పాలి.

05:26.785 --> 05:28.495
- ఏం జరగనుందో వాళ్లకి చెప్పాలి.
- ఏం జరగనుందోనా?

05:28.495 --> 05:29.580
ఏం జరిగింది?

05:30.455 --> 05:31.582
బాంబు.

05:32.416 --> 05:33.250
రివర్.

05:33.250 --> 05:34.334
నేను...

05:36.420 --> 05:37.880
అసలు నీతో ఎందుకు మాట్లాడుతున్నాను నేను?

05:38.672 --> 05:41.967
నిన్ను గుర్తుపట్టా. నువ్వు తొక్కలో సెక్రెటరీవి.

05:42.467 --> 05:44.970
- నన్ను ఫస్ట్ డెస్క్ దగ్గరికి తీసుకెళ్లు.
- డేవిడ్. డేవిడ్, చెప్పేది విను.

05:44.970 --> 05:47.472
చూడు, ఫస్ట్ డెస్క్ చాలా బిజీగా ఉన్నాడు. సరేనా?

05:47.472 --> 05:49.266
- నీకు తెలుసుగా ఎలా ఉంటుందో.
- లేదు.

05:49.266 --> 05:52.144
వాళ్లు నాతో మాట్లాడతారు. నాతో మాట్లాడతారు.
ఒకప్పుడు నేనే ఇన్ ఛార్జీ దానికి.

05:52.144 --> 05:53.520
ఆ విషయం నాకు తెలుసు.

05:53.520 --> 05:58.650
కానీ ఈ సమయంలో, అతను బెర్లిన్ నుండి
వచ్చే టెలిగ్రాములని చదువుతుంటాడు, అంతే కదా?

05:59.234 --> 06:03.280
బెర్లిన్? అవును. అవును కదా. అది...

06:04.156 --> 06:05.324
- ఇంకా అతను...
- షెడ్యూల్.

06:05.324 --> 06:07.618
అవును. అదంతా సక్రమంగా జరిగేలా చూసుకోవాలి ఆయన.

06:07.618 --> 06:09.995
అంటే, మిషన్ పని మీద ఉండే ఏజెంట్లు
సూచనల కోసం చూస్తుంటారు.

06:09.995 --> 06:11.163
దానికి మనం ఆటంకం కలిగించకూడదు.

06:11.163 --> 06:12.956
అవునవును. అది చాలా ప్రమాదకరం.

06:12.956 --> 06:17.544
కాబట్టి, నువ్వు అనుమతి ఇస్తే,
నేను ఇప్పుడు పార్కుకు కాల్ చేసి,

06:17.544 --> 06:20.797
ఆ పనయ్యాక మొదటి అపాయింట్మెంట్ నీకే దక్కేలా చేస్తా.

06:20.797 --> 06:21.715
ఆ పని నువ్వు చేయగలవా?

06:22.549 --> 06:24.218
నేను సెక్రెటరీని. నా పనే అది.

06:24.968 --> 06:26.053
కూర్చో ఇక్కడ.

06:26.720 --> 06:27.721
సరే.

06:29.056 --> 06:30.641
- హమ్మయ్య.
- ఇదిగో నీ టీ.

06:30.641 --> 06:31.934
థ్యాంక్యూ.

06:31.934 --> 06:33.143
నేను ఒక నిమిషంలో వస్తా.

06:33.143 --> 06:34.728
- నువ్వు చాలా పెద్ద సాయం చేస్తున్నావు.
- పర్లేదులే.

06:34.728 --> 06:37.940
నేను ఫస్ట్ డెస్కుతో మాట్లాడాలి.

06:37.940 --> 06:39.024
సరే.

06:46.698 --> 06:47.824
దానికి కారణం నేనే.

06:50.994 --> 06:52.454
దాన్నంతటికీ నేనే కారణం.

07:25.237 --> 07:26.738
పైన ఎవరు ఉన్నారు?

07:27.281 --> 07:28.907
ఎప్పుడూ ఉండే దద్దమ్మలే.

07:28.907 --> 07:32.327
ఎక్కడైనా చేతకాని వాళ్లకే గుర్తింపు,
కష్టపడే నాలాంటి వాళ్లకి దక్కేది మొండి చేయే.

07:32.953 --> 07:35.205
కానీ మీ ఆఫీస్ పైన ఉంటుంది కదా,
కాబట్టి నా వ్యాఖ్యలని ఉపసంహరించుకుంటున్నా.

07:35.205 --> 07:37.583
ఒరేయ్ సన్నాసి, ఒక గంట క్రితం,

07:37.583 --> 07:41.378
చాలా ఖరీదైన షూలు వేసుకొని
ఒకరు పైకి నడుచుకుంటూ వెళ్లారు.

07:41.378 --> 07:42.379
ఎవరది?

07:42.379 --> 07:44.047
అది నా తప్పు కాదు కదా.

07:44.047 --> 07:45.674
ఆమె ఎవరో నాకు తెలీదు.

07:47.759 --> 07:50.304
ఒకవేళ తెలిసి ఉన్నా, తనని నేను ఆపగలిగేవాడిని కాదు.

07:58.395 --> 08:00.230
ఆమె వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావా?

08:00.230 --> 08:02.357
లేదు, అది నా తప్పు కాదు.

08:03.275 --> 08:04.902
రివర్, లవాండ్ కి వెళ్లాడా?

08:05.736 --> 08:07.988
క్యాథరిన్ దగ్గరికి వెళ్లి,
డేవిడ్ కార్ట్ రైట్ ని ఎక్కడైనా వేరే చోట దాయమని చెప్పు.

08:07.988 --> 08:09.948
డేవిడ్, క్యాథరిన్ వాళ్ల ఇంట్లో ఉన్నాడా?

08:11.950 --> 08:13.285
మరి రివర్?

08:22.586 --> 08:24.546
చెప్పాపెట్టకుండా వచ్చేశావే.

08:24.546 --> 08:26.715
అదృష్టం కొద్దీ, నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను.

08:26.715 --> 08:29.801
నీకు ఎవరైనా టీ కానీ, కాఫీ కానీ ఇచ్చారా?

08:29.801 --> 08:31.845
- లేదు.
- హా, ఇవ్వకపోవడం మంచిదైంది.

08:31.845 --> 08:34.515
వాటర్ ట్యాంకులో చచ్చినదేదో పడినట్టుంది.

08:36.265 --> 08:37.476
ఇంతకీ నీకేం కావాలి?

08:37.476 --> 08:38.559
ఎందుకు వచ్చానో తెలుసనుకుంటా.

08:40.437 --> 08:43.649
అప్పుడే నిన్ను స్లౌ హౌస్ కి దొబ్బేయమన్నారా ఏంటి?

08:43.649 --> 08:46.276
ఏం చేశావేంటి? డ్యూటీలో ఉండగా తాగుతూ పట్టుబడ్డావా?

08:46.276 --> 08:47.778
ఇక మీ నటన ఆపండి.

08:47.778 --> 08:49.613
మీరు కనిపిస్తున్నంత పిచ్చి వారు కాదని నాకు తెలుసు.

08:50.197 --> 08:52.074
రక్త పరీక్షల్లో విషయం బయటపడింది, కదా?

08:53.158 --> 08:54.409
ఏం చెప్పమంటావు నన్ను?

08:55.160 --> 08:56.411
అతను నా ఏజెంట్.

08:56.411 --> 08:58.539
అతను చనిపోయాడనే అందరినీ నమ్మించాలనుకున్నాడు,

08:58.539 --> 09:00.749
మరి అలానే అందరూ అనుకోవాలని
నాకు వీలైనంత సేపు నేను ప్రయత్నించా.

09:00.749 --> 09:04.169
అతను మీ ఏజెంటే కావచ్చు, కానీ ఎంఐ5 ఏజెంట్ కూడా,
పైగా అతను హత్య జరిగిన చోట ఉన్నాడు.

09:04.169 --> 09:06.505
ఆ తుపాకీ అతనే పేల్చి ఉండవచ్చు.
నేను అతడిని అదుపులోకి తీసుకుంటున్నా.

09:06.505 --> 09:07.923
అలాగే కానివ్వు.

09:07.923 --> 09:09.550
అతను ఎక్కడికి వెళ్లాడో నాకు తెలీదు.

09:09.550 --> 09:11.176
కాబట్టి, నువ్వు నన్ను ఏం చేసినా,

09:11.176 --> 09:13.053
నా నోటి నుండి ఆ సమాధానమే వస్తుంది.

09:13.053 --> 09:15.222
విచారణకు ఆటంకం కలిగించినందుకు
మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. లేవండి.

09:15.222 --> 09:16.890
లేదులే, నాకు ఇక్కడే బాగుంది, థ్యాంక్స్.

09:16.890 --> 09:19.226
రోజంతా ఖాళీగా ఉండే పని ఉంది నాకు.

09:19.226 --> 09:20.978
కానీ నేను డాగ్స్ ని చాలా మందిని పిలుస్తాను,

09:20.978 --> 09:22.396
వాళ్లు మీ పనికి అడ్డు పడవచ్చు.

09:25.107 --> 09:26.733
ఒక మహిళకి చేతకాక,
అంత మంది మగాళ్లని పంపించాల్సి వచ్చిందని

09:26.733 --> 09:29.611
అందరూ అనుకోవడం నాకు ఇష్టం లేదు.

09:30.988 --> 09:33.824
సంకెళ్లు అక్కర్లేదులే. భలేదానివే.

09:33.824 --> 09:38.245
సిటీ బస్సులో పర్సులు
కొట్టేసే వాడిలా ఉండే వ్యక్తిని నేను నమ్మలేను.

09:40.831 --> 09:43.125
నా రూపురేఖల గురించి కించపరుస్తూ మాట్లాడుతున్నావు.

09:43.125 --> 09:45.377
నేను హెచ్ఆర్ కి కాల్ చేయాల్సి వస్తుంది.

09:50.674 --> 09:52.634
చూడు, నీకు ఎందుకు మండిందో నాకు తెలుసు.

09:55.053 --> 09:58.140
రివర్ చనిపోయాడని టావెర్నర్ కి చెప్పి ఉంటావు,

09:58.140 --> 10:01.518
తను ఎగిరి గంతేసి ఉంటుంది,
కానీ ఇప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్లి,

10:01.518 --> 10:03.812
సమస్యలన్నీ నెత్తి మీదకి తెచ్చే ఏజెంట్
చక్కగా, బతికే ఉన్నాడని,

10:03.812 --> 10:05.772
ఎక్కడికి వెళ్లిపోయాడో, ఏం చేస్తున్నాడో తెలీదని చెప్పాలి.

10:06.648 --> 10:11.403
నా తప్పు సరిదిద్దుకొనే పనిలో భాగంగా,
నేను నీకు డేవిడ్ కార్ట్ రైట్ ని అప్పగించేయగలను.

10:11.403 --> 10:12.738
ఎందుకలా?

10:14.406 --> 10:16.658
ఎందుకంటే, పార్కులోకి వెళ్లడం,
ఐకియాకి వెళ్లడం రెండూ ఒక్కటే.

10:16.658 --> 10:18.911
లోపలికి వెళ్లాక, బయటకు రావడం కష్టం.

10:19.536 --> 10:20.913
చెప్పండి మరి.

10:24.583 --> 10:25.667
నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా?

10:27.169 --> 10:32.591
నువ్వెలా కనిపిస్తున్నావో చెప్తే,
నాకు నువ్వు చచ్చినా సంకెళ్లు తీయవు.

10:32.591 --> 10:35.677
మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి
డేవిడ్ కార్ట్ రైట్ ని బలి చేస్తున్నారా?

10:35.677 --> 10:38.180
రివర్ నా ఏజెంట్. కానీ కార్ట్ రైట్ పిచ్చోడు.

10:38.180 --> 10:42.976
బేస్మెంట్ సెల్ లో అతను కూర్చోవడం అన్న
ఆలోచనే నాకు లాటరీ తగిలినంత ఆనందాన్ని ఇస్తోంది.

10:44.311 --> 10:45.187
ఎక్కడున్నాడు అతను?

11:00.369 --> 11:01.370
హేయ్.

11:03.664 --> 11:04.957
హేయ్, సారీ.

11:04.957 --> 11:06.083
ఎందుకు?

11:06.667 --> 11:08.460
నువ్వు డాగ్ అని నేను అనుకోలేదు.

11:09.336 --> 11:11.922
అంటే, నువ్వు కుక్కవి కాదులే.

11:13.257 --> 11:14.758
నీ రెక్కలని ఎక్కడ పెట్టావు?

11:15.843 --> 11:17.219
అంటే, నువ్వు ఏంజెల్ లా ఉన్నావని నా ఉద్దేశం.

11:18.387 --> 11:23.725
రెక్కలు అన్నాను కదా అని నువ్వు గబ్బిలమో,
కాకో అనుకుంటావేమో అని చెప్తున్నా.

11:25.435 --> 11:28.313
కానీ నీ కాళ్లని చూస్తే మాత్రం,
హంసే గుర్తొస్తుంది, ఏమంటావు?

11:36.113 --> 11:37.114
హేయ్!

11:40.742 --> 11:43.370
నాకు ఎలాగూ లవర్ ఉందిలే. కాబట్టి బొక్క నీకే.

11:43.871 --> 11:46.164
నేను దీన్ని సులభంగా విడిపించుకోగలను, కాబట్టి...

11:48.166 --> 11:49.543
బొక్కబొర్లా పడ్డావు నువ్వే.

11:53.755 --> 11:54.756
- హాయ్.
- హాయ్.

12:03.807 --> 12:06.310
గీతీ? నీ పేరు గీతీయే కదా?

12:06.310 --> 12:07.936
- నీ పేరు గీతీయే కదా? సరే.
- అవును.

12:07.936 --> 12:09.563
వద్దు, వద్దు. కూర్చో, కూర్చో.

12:09.563 --> 12:11.607
కూర్చో. నేను ఎక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు.

12:12.649 --> 12:15.194
అందరూ ఒకటే అని అనుకుంటా.

12:16.028 --> 12:19.156
అంటే నీ గురించి డయానా టావెర్నర్
చాలా గొప్పగా చెప్పిందన్నమాట...

12:19.156 --> 12:21.366
కోల్డ్ బాడీ కేసులో నువ్వు చేసిన పని గురించి.

12:21.366 --> 12:23.202
అందుకని నీకు ధన్యవాదాలు తెలపాలని వచ్చా.

12:23.202 --> 12:26.496
థ్యాంక్యూ. అది సాంకేతిక లోపమని
తెలిసి హమ్మయ్య అనుకున్నా.

12:26.496 --> 12:28.874
అవును. అది సాంకేతిక లోపమే. హా.

12:28.874 --> 12:30.709
కానీ, ఒక నిమిషం పాటు అందరినీ కంగారు పెట్టేసింది.

12:30.709 --> 12:32.920
అందరినీ అనవసరంగా
కంగారు పెట్టించడం నా ఉద్దేశం కాదు.

12:32.920 --> 12:34.630
అదేం లేదులే. అది అనవసరం కూడా కాదు.

12:34.630 --> 12:37.841
అంటే, మనం అన్ని అవకాశాలనూ పరిశీలించాలి.

12:37.841 --> 12:40.594
నిజానికి, దాని వల్లే నాకొక ఆలోచన వచ్చింది,

12:40.594 --> 12:43.764
ఆర్కైవ్స్ ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసి,
సాంకేతిక లోపాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో

12:43.764 --> 12:46.725
చెక్ చేస్తే మేలు అనిపించింది.

12:46.725 --> 12:50.604
కోల్డ్ బాడీ ప్రోగ్రామ్ లో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అని.

12:51.605 --> 12:52.689
సరే.

12:52.689 --> 12:54.816
ఆ విషయాన్ని నేను ఆమెకి చెప్పి చూశాను.

12:55.400 --> 12:56.902
- అదే సెకండ్ డెస్క్ కి.
- చెప్పావా?

12:57.402 --> 13:00.364
హా. కానీ నేను ప్రస్తుతం చేస్తున్న డ్యూటీనే
కొనసాగిస్తే మేలు అని చెప్పింది.

13:00.364 --> 13:01.448
అవునా? సరే.

13:01.448 --> 13:04.535
తన వైపు నుండి చూస్తే, అది సరైనదే.

13:05.160 --> 13:07.663
అంటే, తనే లైవ్ ఆపరేషన్స్ ని చూసుకుంటోంది, కదా?

13:07.663 --> 13:11.500
మళ్లీ ఇప్పుడు ఈ వెస్ట్ ఏకర్స్ ఉదంతం పుణ్యమా అని,
ఆమెకి కేవలం ఊహాగానాల ఆధారంగా

13:11.500 --> 13:15.963
దర్యాప్తు చేసేంత సమయం లేదనే చెప్పాలి.

13:16.755 --> 13:21.468
కానీ నాకు ఆ సమయం ఉంది,
నువ్వు నేరుగా నాకు రిపోర్ట్ చేయాలి.

13:22.302 --> 13:23.720
ఆ మాట అని నా హృదయం దోచుకున్నారు.

13:24.471 --> 13:26.932
- హృదయం దోచుకున్నారని అని ఉండాల్సింది కాదేమో.
- హా, అవుననుకుంటా.

13:26.932 --> 13:29.101
- నేను ఈ పని చేస్తే ఆమెకి ఓకేనే కదా?
- హా, అంటే కొంచెం...

13:29.101 --> 13:30.936
సమస్యల్లో చిక్కుకోవాలని నాకు లేదు.

13:30.936 --> 13:33.564
లేదు, లేదు, ఈ విషయాన్ని మనిద్దరి మధ్యే ఉంచుదాం.

13:34.231 --> 13:36.149
సాహస కార్యాల్లో భాగంగా రహస్యంగా పనులు చేయడం మేలే.

13:36.149 --> 13:39.069
ఏమైనా సమస్యలు వచ్చే అవకాశముంటే,
నువ్వు చేసే పని వల్ల వాటిని నివారించవచ్చు,

13:39.069 --> 13:41.196
అంతకన్నా గొప్ప సాయం ఇంకేముంటుంది!

13:41.196 --> 13:45.659
కాబట్టి నీకు ఆ వీలు కల్పించడానికి
నేను చేయగలిగింది ఏదైనా ఉంటే,

13:46.285 --> 13:48.120
దయచేసి చెప్పు.

13:50.831 --> 13:51.915
ముందు నువ్వు పద.

13:51.915 --> 13:54.084
- ఇక్కడికి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా?
- రాలేదు.

13:54.084 --> 13:55.752
- మోలీని కలిశావా?
- లేదు.

13:56.336 --> 13:58.172
భలే సరదాగా ఉంటుంది. మామూలు సరదాగా కాదు.

14:05.012 --> 14:07.097
- హలో, మోలీ.
- హలో, గుంట నక్కా.

14:09.766 --> 14:12.060
దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించడానికి
గేమింగ్ ప్రోగ్రామ్స్ ని ఉపయోగించే వాళ్లని

14:12.060 --> 14:15.564
గుంట నక్క అంటుంటారు అన్నమాట.

14:15.564 --> 14:17.441
దాని అర్థం అదే అన్నమాట.

14:17.441 --> 14:20.235
నా దృష్టిలో నువ్వెప్పుడూ గుంట నక్కవే.

14:21.028 --> 14:23.030
హా, మోలీ, నేను ఫస్ట్ డెస్కును కదా?

14:23.030 --> 14:25.199
అలా అనడం తగదు కదా?

14:25.199 --> 14:28.035
- కాబట్టి, కోల్డ్ బాడీలు?
- హా.

14:28.035 --> 14:31.538
హా, ఒక కోల్డ్ బాడీ దొరికిందని, దానికి, వెస్ట్ ఏకర్స్ కి
లింక్ ఉండుండవచ్చని ఈ గీతీ భావిస్తోంది.

14:32.497 --> 14:36.210
కాబట్టి, నేను తనకి అప్పగిస్తున్న పని ఏంటంటే,
ఇప్పుడు ప్రపంచంలోని ఎవరూ

14:36.210 --> 14:41.423
మన కోల్డ్ బాడీలను ఉపయోగించడం లేదని
నిర్ధారించుకోవడానికి ఒకసారి వాటన్నింటినీ పరిశీలించడం.

14:41.423 --> 14:42.674
అర్థమైందా?

14:43.217 --> 14:46.637
ఈ విభాగంలో ఎక్కడెక్కడ ఏమేం ఉంటాయో
నువ్వు తనకి చూపించగలిగితే,

14:46.637 --> 14:50.849
తనకి వీలైనంతగా నువ్వు సాయపడగలిగితే,
చాలా మేలు చేసిన దానివి అవుతావు.

14:54.978 --> 14:57.397
థ్యాంక్యూ. చాలా చాలా థ్యాంక్స్, గీతీ. థ్యాంక్యూ.

14:59.525 --> 15:03.195
ఫస్ట్ డెస్క్, సెకండ్ డెస్క్ మధ్య
ఆధిపత్య పోరు చూసి విసుగొచ్చేస్తోంది నాకు.

15:04.029 --> 15:06.365
హా, నాకు కూడా. భలే గమ్మత్తుగా ఉంది కదా.

15:06.365 --> 15:09.868
గమ్మత్తుగా ఎందుకు ఉందంటే,
ఎవరికి పై చేయి దక్కవచ్చని నీకు అనిపిస్తోంది?

15:09.868 --> 15:14.748
ఫస్ట్ డెస్క్, సెకండ్ డెస్క్ మధ్య,
నీ ఉద్దేశం ప్రకారం ఎవరికి...

15:14.748 --> 15:16.333
డయానా టావెర్నర్.

15:41.859 --> 15:42.860
నటాషా!

16:17.936 --> 16:18.937
ఎవరు నువ్వు?

16:19.605 --> 16:21.356
నాతో మాట్లాడాలనుకుంటున్న వ్యక్తి మీరేనా?

16:21.356 --> 16:23.984
తుపాకీ మా దగ్గర ఉంది. కాబట్టి, ప్రశ్నలు మేమే అడగాలి.

16:24.943 --> 16:26.278
సరే.

16:26.278 --> 16:28.697
నువ్వు లెస్ ఆబ్ లో ఉండే వ్యక్తిలా ఉన్నావు.

16:28.697 --> 16:32.284
అతని ఫోటో ఉన్న పాస్ పోర్ట్
నీ దగ్గర ఉంది, కానీ నువ్వు అతను కాదు.

16:33.535 --> 16:34.703
ఎందుకు వచ్చావు ఇక్కడికి?

16:34.703 --> 16:37.247
అతను ఎప్పుడూ నాపైకి
తుపాకీ ఎక్కి పెట్టే ఉంటాడు కాబట్టి,

16:37.247 --> 16:39.750
అతనంటే ఈయనికి ఇష్టం లేదనుకుంటా.

16:39.750 --> 16:41.460
కాబట్టి, అతను చనిపోయాడని,
ఇంకెవరినీ ఏమీ చేయలేడని చెప్తున్నా,

16:41.460 --> 16:44.087
ఇకనైనా అతను తుపాకీ దించుతాడా?

16:50.511 --> 16:52.054
ఎందుకు అతను తుపాకీ దించట్లేదు?

16:54.723 --> 16:56.016
అతను నా కొడుకు.

16:59.186 --> 17:00.479
ఎలా చనిపోయాడు?

17:02.314 --> 17:05.108
నాలా నటిస్తూ, మా తాతయ్య ఇంటికి వెళ్లాడు,

17:05.901 --> 17:08.028
స్నానపు తొట్టెలో మా తాతయ్యని ముంచి
చంపేయాలన్నది అతని ప్లాన్.

17:08.569 --> 17:10.239
కానీ మా తాతయ్య అతడిని తుపాకీతో కాల్చేశాడు.

17:19.580 --> 17:21.415
అతను అలా చావడంలో ఆశ్చర్యం లేదులే.

17:22.542 --> 17:23.794
అతని తండ్రి అలాంటోడు మరి.

17:25.878 --> 17:27.673
చూడండి.

17:30.008 --> 17:32.386
నేను ఎంఐ5 ఏజెంటుని. సరేనా?

17:34.388 --> 17:36.223
బ్రిటిష్ సెక్యూరిటీ సర్వీస్ అది.

17:36.223 --> 17:37.474
ఏదైతే, మాకేంటి!

17:38.475 --> 17:39.685
నువ్వు... వెళ్లిపో.

17:47.985 --> 17:49.236
సరే.

17:55.742 --> 17:56.577
చూడండి, చూడండి.

17:56.577 --> 18:00.747
మీ అబ్బాయి విషయంలో జరిగిన దానికి
చింతిస్తున్నాను, కానీ అతనెవరో నాకు తెలియాలి.

18:00.747 --> 18:03.125
నిన్ను వెళ్లిపొమ్మంటున్నాం, కాబట్టి వెళ్లిపో.

18:03.125 --> 18:06.044
మీరు ఆ తుపాకీ ఎక్కుపెట్టడం ఇక ఆపండి.

18:08.088 --> 18:09.131
ఎవరు వాళ్లు?

18:10.132 --> 18:11.216
నువ్వే బెర్ట్ రాండ్ అనుకుంటున్నారు.

18:11.216 --> 18:14.178
సరే. కానీ నేను బెర్ట్ రాండ్ కాదు కదా?
వాళ్లకి ఆ విషయం మీరు చెప్పగలరా?

18:14.178 --> 18:17.181
- నువ్వే చెప్పుకో.
- నేను... సరే, చూడండి.

18:17.181 --> 18:18.348
నేను చెప్పేది వినండి, సరేనా?

18:19.433 --> 18:21.643
ఈ ఫోటో ఉంది కదా? ఇతను ఉన్నాడు కదా?

18:21.643 --> 18:23.604
అతని పక్కన ఉండేది మీ అబ్బాయేనా?

18:24.396 --> 18:26.648
- అవును.
- ఇతను కూడా లాస్ ఆబ్ లో ఉండేవాడు, కదా?

18:26.648 --> 18:27.983
- అవును కదా?
- అవును.

18:27.983 --> 18:30.068
మీకు లండనులో జరిగిన బాంబు దాడి తెలుసా?
అదే, షాపింగ్ మాల్ లో జరిగింది?

18:30.068 --> 18:31.320
అది ఇతని పనే.

18:31.820 --> 18:33.071
అతనే ఆ బాంబుని పేల్చాడు.

18:35.115 --> 18:36.617
అలా మళ్లీ జరగవచ్చు.

18:37.910 --> 18:40.621
కాబట్టి, వీళ్లు ఎవరో,

18:40.621 --> 18:42.039
ఎక్కడ ఉంటారో, మీరు నాకు చెప్పాలి.

18:47.920 --> 18:49.963
క్యాథరిన్, నేనే లుయీసాని. మళ్లీ చేస్తున్నా.

18:50.756 --> 18:54.051
డాగ్స్ స్క్వాడ్ కి కొత్త హెడ్ అయిన ఎమ్మా ఫ్లైట్,
మీ ఇంటికే బయలుదేరింది.

18:54.051 --> 18:56.970
తను డేవిడ్ కార్ట్ రైట్ కోసం వస్తోంది.
నువ్వు తనని ఎక్కడైనా దాచాలి, తను రాక ముందే...

18:58.931 --> 18:59.932
అబ్బా.

19:06.563 --> 19:07.564
హలో!

19:08.273 --> 19:10.108
ఏవండీ? హాయ్.

19:10.817 --> 19:13.904
నన్ను క్షమించండి,
కానీ నన్ను ఎవరో వెంబడిస్తున్నారనిపిస్తోంది.

19:13.904 --> 19:17.449
కాస్త రోడ్డు చివరిదాకా నాకు తోడుగా నడవగలరా?

19:18.450 --> 19:19.660
నాకెవరూ కనిపించట్లేదే.

19:20.452 --> 19:22.037
వాళ్లు ఎక్కడైనా దాక్కున్నారేమో.

19:22.037 --> 19:24.623
నేను... నేను ఇందాక ఒక షాపుకు వెళ్లాను,
బయటకు వచ్చి చూస్తే,

19:24.623 --> 19:27.292
అతను లేడు, వెళ్లిపోయాడు అనుకున్నా,
కానీ కాసేపయ్యాక నా వెనకే ఉన్నాడు.

19:27.960 --> 19:28.794
అతను కాదు కదా?

19:30.754 --> 19:32.798
కాదు, కాదు. అతను... అతను కుర్రాడే.

19:32.798 --> 19:35.050
కళ్లు చాలా భయంకరంగా ఉన్నాయి,
చాలా ప్రమాదకరమైన వ్యక్తి అతను.

19:35.050 --> 19:37.511
సరే. మీ అదృష్టం బాగుంది,
ఎందుకంటే నేను సెక్యూరిటీ సర్వీసెస్ లో పని చేస్తా.

19:37.511 --> 19:38.804
హమ్మయ్య. కాస్త నాకు తోడుగా నడుస్తారా?

19:38.804 --> 19:41.431
- ఆ పని నా సహోద్యోగి చేస్తాడులే.
- సరే.

19:41.431 --> 19:42.808
- మంచిది. థ్యాంక్స్.
- పర్లేదు.

19:44.643 --> 19:47.312
- అంతా ఓకేనా?
- హా. అంతా ఓకే.

19:47.312 --> 19:49.731
నేను ఇప్పుడే మీ సహోద్యోగినితో మాట్లాడా.

19:49.731 --> 19:51.859
నన్ను ఒకరు వెంబడిస్తున్నారనుకున్నా,
కానీ ఎవరూ వెంబడించట్లేదు.

19:51.859 --> 19:53.026
- కాబట్టి, అంతా...
- పక్కానా?

19:53.026 --> 19:55.320
- హా. థ్యాంక్యూ. బాబోయ్.
- మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది.

19:57.239 --> 20:00.075
వావ్. ఒంటరి మహిళ కనిపించే సరికి
నీ బుద్ది చూపిస్తున్నావా?

20:00.075 --> 20:02.619
లేదు. బాబోయ్, అస్సలు కాదు.
మనం ఇది వరకు కలిశామనిపించింది. అంతే.

20:02.619 --> 20:04.788
సరే. అక్కడే ఉండు, లేదంటే నీపై ఫిర్యాదు చేస్తా.

20:04.788 --> 20:06.081
- సరేనా?
- సరే.

20:08.625 --> 20:09.626
ఇప్పుడు నువ్వు వెంబడిస్తున్నావా?

20:12.713 --> 20:14.256
ఏదో సాయం చేద్దామనుకున్నానంతే, మేడమ్.

20:19.678 --> 20:21.555
ఎమ్మా ఫ్లైట్. పార్కులో సెక్యూరిటీ హెడ్ ని.

20:22.806 --> 20:24.266
మీ ఐడీ చూపిస్తారా?

20:32.274 --> 20:34.067
- మీకేం కావాలి?
- నన్ను లోపలికి రానివ్వండి.

20:35.027 --> 20:36.069
వారెంట్ ఉందా?

20:36.069 --> 20:37.863
మీరు ఇప్పటికీ సర్వీసులోనే ఉన్నారు,

20:37.863 --> 20:39.865
అంటే, మీరు నా అధికార పరిధికి లోబడే ఉంటారు.

20:39.865 --> 20:41.658
అంటే, నాకు వారెంట్ అక్కర్లేదని అర్థం.

20:41.658 --> 20:44.161
కానీ, నేను రాజీనామా చేసి చాలా కాలమైంది.

20:44.161 --> 20:46.121
అవును. కానీ అసలు విషయం వేరు కదా.

20:46.121 --> 20:49.458
మీరు రాజీనామా సమర్పించారు,
కానీ ఏదో పేపర్ వర్క్ పెండింగ్ ఉండి, అది ఆగిపోయింది.

20:49.458 --> 20:51.460
ఒకటి చెప్పండి, మీకు జీతం పడుతోంది కదా?

20:51.460 --> 20:53.086
పడుతోంది, కానీ నేను దాన్ని వాడట్లేదు.

20:53.086 --> 20:56.089
వాడితే ఏంటి, వాడకపోతే ఏంటి!
మీరు ఉద్యోగి అన్నట్టే, కాబట్టి తెరవండి

21:06.725 --> 21:09.770
...వెస్ట్ ఏకర్స్ దర్యాప్తు
ఎక్కడి దాకా వచ్చిందో చెప్పడానికి

21:09.770 --> 21:11.355
డెప్యూటీ కమిషనర్ మన ముందు ఉన్నారు...

21:11.355 --> 21:13.440
ఇంకా టచ్ లోనే ఉంటున్నట్టున్నారు.

21:13.440 --> 21:15.817
వార్తలు ఎప్పటికప్పుడు చదువుకోకూడదా ఏంటి!

21:15.817 --> 21:17.736
- ఇల్లు బాగుంది.
- థ్యాంక్యూ.

21:17.736 --> 21:18.987
ప్రశాంతంగా కూడా ఉంది.

21:19.821 --> 21:21.406
పుస్తకాలు కూడా చాలానే ఉన్నాయి.

21:21.406 --> 21:24.368
మంచి పుస్తకం చదివేటప్పుడు
శబ్దం వస్తుంటే చిరాగ్గానే ఉంటుంది కదా.

21:24.368 --> 21:26.370
ఇంటికి ఎవరుపడితే వాళ్లు
వచ్చినా కూడా చిరాగ్గానే ఉంటుంది.

21:27.996 --> 21:31.250
- ఇంటికి వచ్చే వాళ్లంటే గుర్తొచ్చింది, అతను ఎక్కడ?
- ఎవరు?

21:32.709 --> 21:34.127
డేవిడ్ కార్ట్ రైట్.

21:34.127 --> 21:38.090
డేవ్... నేను డేవిడ్ కార్ట్ రైట్ ని చూసి
ఇరవై ఏళ్లు పైనే అయింది, కాబట్టి...

21:38.090 --> 21:39.800
అక్కడికి వెళ్లకండి.

21:40.843 --> 21:41.969
అతను ఎందుకు అక్కడ...

21:43.637 --> 21:46.181
ఇక్కడికి రావద్దని చెప్పా కదా.

21:46.181 --> 21:48.350
నా పడకగదిలోకి బయటివారు రావడం నాకు నచ్చదు.

21:49.351 --> 21:50.352
ఏం చేస్తున్నారు?

21:52.396 --> 21:55.941
మన్నించాలి, మీరు ఏం చేస్తున్నారో
మీకైనా అర్థం అవుతోందా?

21:55.941 --> 21:57.401
అయ్య బాబోయ్.

22:04.616 --> 22:05.951
దీనికి తాళం ఎందుకు వేసుంది?

22:05.951 --> 22:07.327
తాళం లేదు. తలుపు ఇరుక్కొని ఉంటుందంతే.

22:07.327 --> 22:10.831
మెల్లగా తెరవాలి, లేదంటే అదే జరుగుతుంది. చూశారా?

22:11.498 --> 22:13.000
నేను ఇక్కడ ఎక్కువ వస్తువులు పెడుతున్నట్టున్నా.

22:13.000 --> 22:15.085
చూడండి, అతను ఇక్కడ ఉన్నాడని ఎవరు చెప్పారు?

22:15.085 --> 22:16.170
జాక్సన్ ల్యాంబ్.

22:19.173 --> 22:22.009
నన్ను ఇబ్బంది పెట్టడానికే మిమ్మల్ని పంపించి ఉంటాడు.

22:22.009 --> 22:23.343
మా ఇద్దరికీ పొసగట్లేదు.

22:24.052 --> 22:26.930
మిమ్మల్ని వాడుకున్నాడు, మిస్ ఫ్లైట్.

22:26.930 --> 22:28.307
ఒక్క నిమిషం ఆగండి.

22:29.224 --> 22:31.518
డేవిడ్ ని కనుగొనే విషయంలో, గుడ్ లక్.

22:32.561 --> 22:36.231
అతను ఎక్కడ ఉన్నాడో
అతని మనవడు, రివర్ ని అడిగి చూడండి.

22:46.200 --> 22:47.743
సరే. కాసేపట్లో వస్తా.

22:48.493 --> 22:50.829
ఆ తుపాకీ నీ దగ్గర పెట్టుకోవడమే మంచిదేమో.

22:50.829 --> 22:52.247
ఎవరి పైన అయినా దాడి జరగవచ్చు.

22:53.832 --> 22:57.127
వెస్ట్ ఏకర్స్ ఉదంతం తర్వాత, తదుపరి దాడి
ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం.

22:59.046 --> 23:01.381
నీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని, నోర్మూసుకొని ఉండు.

23:02.090 --> 23:03.800
దాన్ని అమ్మడం మంచిది కాదు.

23:03.800 --> 23:06.220
ఇంకా క్రిస్మస్ అలంకరణలు అలానే
ఉన్నాయి, నిజానికి అది మంచిది కాదు.

23:06.220 --> 23:08.680
ఒకటి తుపాకులని చలామణీ చేయడం,
ఇంకోటి మూఢ నమ్మకం.

23:08.680 --> 23:09.681
రెండూ ఒక్కటే కదా!

23:09.681 --> 23:11.850
చూడు, నాకు ఈ పని చేయాలని లేదు,
కానీ నాకు మరో దారి లేదు.

23:11.850 --> 23:13.435
చెల్లించని బిల్స్ ఉన్నాయని క్యాసీకి తెలుస్తోంది.

23:13.435 --> 23:16.522
- పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
- అది నువ్వు చేసుకున్నదే.

23:17.356 --> 23:18.941
చూడు, దీని సంగతి చూశాక, ఇక జూదం ఆడను.

23:20.734 --> 23:22.194
ఈసారి నిజం చెప్తున్నా.

23:25.489 --> 23:28.534
హాయ్. కిందికి వచ్చి నాకు సాయపడగలవా?

23:28.534 --> 23:30.077
దొబ్బేయ్.

23:34.665 --> 23:35.791
హోకి సాయం కావాలట.

23:35.791 --> 23:38.502
వాడి ఆత్మహత్యకి సాయపడమంటే వెళ్తా, ఇక దేనికీ వెళ్లను.

23:40.921 --> 23:43.131
చూడు, నాకు సంకెళ్లు వేసి,
నా జిమ్ మెషిన్ కి తగిలించారు.

23:49.513 --> 23:51.765
తనకి సంకెళ్లు వేసి, జిమ్ మెషిన్ కి తగిలించారట.
చూసి పండగ చేసుకుంటా.

24:01.567 --> 24:04.778
ఇది ప్రమాదవశాత్తు జరిగిందా,
లేదా నీ పిచ్చి పనుల్లో భాగంగా నువ్వే చేసుకున్నావా?

24:05.612 --> 24:06.613
ఫ్లైట్ పని ఇది.

24:07.239 --> 24:08.073
మంచి పని చేసింది.

24:08.073 --> 24:10.367
ఎందుకు అని నేను అడగనులే,
ఎందుకంటే, నీకు ఇలా జరగాల్సిందే.

24:10.367 --> 24:11.869
కాస్త నాకు సాయపడతావా?

24:11.869 --> 24:12.995
సాయపడను.

24:16.957 --> 24:18.375
ఏం చేస్తున్నావు?

24:20.752 --> 24:23.839
కనీసం రాత్రంతా అలానే ఉండనివ్వు,
లేదా ప్యాంట్ తడుపుకునే దాకా అయినా.

24:23.839 --> 24:25.007
నేను ఇతనికి సాయపడాలి.

24:27.634 --> 24:29.011
అక్కర్లేదు.

24:32.264 --> 24:35.184
నేను అతని సంకెళ్లు
ఎందుకు తీస్తున్నానో తెలుసుకోవాలనుందా?

24:35.726 --> 24:38.270
నా గొంతుపై కత్తి ఎందుకు పెట్టావో తెలుసుకోవాలనుంది.

24:38.270 --> 24:40.022
నన్ను ఇక్కడ వేయక ముందు,

24:40.022 --> 24:44.193
నా ఇష్టానికి వ్యతిరేకంగా నాకు సంకెళ్లు వేసి,
డెబ్బై రెండు గంటల పాటు నన్ను కుర్చీకి కట్టేశారు.

24:44.776 --> 24:50.240
కాబట్టి, అతనికి సంకెళ్ళు చూస్తే, ఇబ్బందిగా అనిపిస్తోంది.

24:52.826 --> 24:54.578
సరే. అర్థమైంది.

25:12.471 --> 25:14.056
నీ చేతులకి సంకెళ్లు ఉన్నప్పుడు ఏం జరిగింది?

25:15.015 --> 25:18.477
ఒకడు నా కడుపును కోసి తెరుస్తానని బెదిరించాడు.

25:20.521 --> 25:21.980
వాడి దగ్గర ఎలక్ట్రిక్...

25:24.900 --> 25:26.151
కార్వింగ్ కత్తి ఉంది.

25:31.532 --> 25:32.616
వావ్.

25:34.701 --> 25:35.786
సంకెళ్ల బాధితులం.

25:39.915 --> 25:43.961
నన్ను తాకడం నాకు నచ్చదు.

25:49.258 --> 25:50.968
అయ్య బాబోయ్.

26:03.397 --> 26:04.648
విక్టర్ నాకు కజిన్.

26:05.858 --> 26:06.859
అవునా?

26:07.860 --> 26:08.986
మిమ్మల్ని కలవడం బాగుంది, విక్టర్.

26:09.945 --> 26:11.697
లెస్ ఆబ్ లో ఉండే వాడు నన్ను గర్భవతిని చేసినప్పుడు

26:11.697 --> 26:14.241
నాకు ఇతనొక్కడే అండగా నిలిచాడు.

26:15.742 --> 26:16.827
అప్పుడు నాకు 17 ఏళ్లు.

26:17.870 --> 26:19.830
అతను ఇతనేనా?

26:21.290 --> 26:22.332
అవును.

26:23.792 --> 26:25.460
ఫ్రాంక్ హార్క్ నెస్.

26:26.295 --> 26:29.631
అయినా, అతను చాలా అబద్ధాలు చెప్పేవాడు,
అది అతని నిజమైన పేరు అయ్యుండదు.

26:31.175 --> 26:32.676
అతను నా కొడుకుని అస్సలు చూడనివ్వలేదు.

26:32.676 --> 26:38.682
కాబట్టి, నేను వేరే చోటికి మకాం మార్చేశాను,
అప్పుడప్పుడూ బెర్ట్ రాండ్ ని చూడటానికి వచ్చే దాన్ని,

26:39.558 --> 26:43.228
వాడు అసలు నేను లేనట్టు ప్రవర్తించేవాడు.

26:44.354 --> 26:46.940
లెస్ ఆబ్ లో ఉండే వాళ్లందరూ వెళ్లిపోయారని,

26:48.775 --> 26:50.694
తను మళ్లీ బెర్ట్ రాండ్ ని చూసే అవకాశం లేదని విన్నాం.

26:52.029 --> 26:53.530
నువ్వే బెర్ట్ రాండ్ అని అనుకున్నా.

26:53.530 --> 26:58.410
కాబట్టి, ఈమెకి కాల్ చేసి, నిన్ను వెంబడించా.

26:59.203 --> 27:01.496
ఫ్రాంక్ నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుండగా చూశా.

27:01.997 --> 27:03.207
అప్పుడే కదా మీరు నన్ను కొట్టారు...

27:06.793 --> 27:09.463
అసలు ఫ్రాంక్ నిన్ను ఎందుకు చంపాలనుకున్నాడు?

27:10.047 --> 27:13.717
అతను ఆధారాలను నాశనం చేస్తుండగా
మధ్యలో నేను అడ్డు తగిలాను అనుకుంటా.

27:14.259 --> 27:15.886
బాంబు దాడి చేసిన వ్యక్తి గురించి ఏమైనా చెప్పగలరా?

27:17.137 --> 27:19.139
- ఈవ్.
- ఈవ్.

27:19.139 --> 27:22.851
చిన్నప్పుడు అతని పట్ల క్రూరంగా వ్యవహరించారు
కాబట్టి, అతను ఈ బాట పట్టడంలో ఆశ్చర్యం లేదు.

27:22.851 --> 27:26.146
అతనిలో ద్వేషం, కోపం మనకి కనిపించేస్తాయి.

27:26.939 --> 27:30.192
అయితే, మీరు లెస్ ఆబ్ లో కొంత కాలం ఉన్నారా?

27:30.943 --> 27:32.236
హా.

27:32.236 --> 27:33.862
బెర్ట్ రాండ్ చిన్నప్పుడు.

27:34.738 --> 27:35.948
దీన్ని గీసింది మీరేనా?

27:39.326 --> 27:42.829
నేను కాదు. అక్కడ ఉండే
వేరే అమ్మాయిల్లో ఒక అమ్మాయి గీసింది.

27:43.372 --> 27:44.498
వేరే అమ్మాయిలా?

27:45.457 --> 27:47.084
అవును. తల్లులు.

27:47.084 --> 27:50.045
అక్కడ కొందరు రష్యన్ అమ్మాయిలు ఉండేవాళ్లు,
ఒక గ్రీక్ అమ్మాయి ఉండేది.

27:50.045 --> 27:54.758
ఒక ఇంగ్లీష్ అమ్మాయి,
ఒక స్థానిక అమ్మాయి కూడా ఉండేది అనుకుంటా.

27:55.425 --> 27:59.721
వాళ్లని అతను గర్భవతి చేసి,
పిల్లలు పుట్టాక ఆ తల్లులని పంపించేసే వాడు,

27:59.721 --> 28:00.889
ఎందుకంటే...

28:01.557 --> 28:03.225
అతనికి అలాగే ఉండాలి.

28:05.811 --> 28:06.812
వాళ్లతో నేను మాట్లాడతా.

28:07.604 --> 28:09.648
వాళ్లు అనుకుంటున్న వ్యక్తివి నువ్వు కాదని చెప్తా.

28:09.648 --> 28:11.275
హా, ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి.

28:13.819 --> 28:16.613
వావ్. వాళ్లకి మీ అబ్బాయి అంటే
అసలు ఇష్టమున్నట్టు లేదే?

28:16.613 --> 28:20.742
అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా,
అతని కొడుకుని ఆసుపత్రి పాలు చేశాడు బెర్ట్ రాండ్,

28:20.742 --> 28:22.327
ఇంకా అతని కూతురిపై దాడి చేశాడు.

28:22.327 --> 28:25.122
కాబట్టి, అతనికి అంత ద్వేషం ఉండటంలో అర్థముంది.

28:26.248 --> 28:27.583
విక్టర్ వాళ్లని సముదాయిస్తాడులే.

28:32.671 --> 28:34.214
- అయ్య బాబోయ్. దేవుడా.
- పారిపో.

28:42.222 --> 28:43.390
ఆ కుక్క చాలా పెద్దగా ఉంది.

28:48.770 --> 28:50.230
అతను మీరు అనుకొనే వ్యక్తి కాదు!

28:50.647 --> 28:51.940
అతను బెర్ట్ రాండ్ కాదు!

29:02.576 --> 29:03.493
అబ్బా.

29:53.585 --> 29:55.087
అబ్బా.

30:14.439 --> 30:15.274
మిస్టర్.

30:15.274 --> 30:16.775
సరే, దొబ్బేయ్!

30:19.444 --> 30:21.154
అబ్బా...

30:52.519 --> 30:54.188
ఫోన్ ఎత్తట్లేదు ఎందుకు?

30:54.897 --> 30:58.233
- ఇంతకీ, ఎలా ఉన్నావు?
- ఫోన్ రివర్ దగ్గర ఉంది. నేను బానే ఉన్నా. థ్యాంక్యూ.

30:59.401 --> 31:01.111
ఆ ముక్క నాకు ల్యాంబ్ ఎందుకు చెప్పలేదు?

31:01.111 --> 31:02.738
అయితే, నిన్ను ల్యాంబ్ పంపించాడా?

31:02.738 --> 31:05.324
అవును. డేవిడ్ ఎక్కడ ఉన్నాడు?

31:05.324 --> 31:06.783
అదృష్టవశాత్తూ, నేను అతడిని వేరే చోటికి మార్చేశా.

31:06.783 --> 31:09.536
అతడిని ఎలా కనిపెట్టాలో కనుగొనడానికి
ల్యాంబ్ కి అయిదు నిమిషాలు పెట్టింది.

31:09.536 --> 31:10.996
అంటే, అతను చాలా మంది కంటే తెలివైన వాడే,

31:10.996 --> 31:13.457
కానీ స్పూక్ స్ట్రీట్ లో ఉండే వాళ్లలో
అతనే తెలివైన వాడు కాదు.

31:13.457 --> 31:17.169
డేవిడ్ ని ఒక సురక్షితమైన చోటుకు తీసుకెళ్లా, అక్కడ
ఫస్ట్ డెస్క్ ని కలుసుకుంటున్నాడని డేవిడ్ అనుకుంటున్నాడు.

31:17.169 --> 31:18.962
- ఎక్కడ?
- 25వ నంబర్ ఇంటిలో.

31:18.962 --> 31:20.756
ఆ ఇంట్లో వాళ్ల పిల్లిని చూసుకుంటున్నా.

31:22.508 --> 31:24.510
రివర్ ని నువ్వు చూసినప్పుడు, అతను ఎలా ఉన్నాడు?

31:25.552 --> 31:27.095
అన్నింటినీ పరిగణనలోకి
తీసుకున్నాక, బాగా ఉన్నాడనే చెప్పాలి.

31:27.095 --> 31:28.347
అతను నీ ఫోన్ ఎత్తట్లేదు.

31:28.347 --> 31:30.432
అతను ఎత్తడు. సిమ్ కార్డ్ తీసేశాడు.

31:31.391 --> 31:33.060
రివర్ చనిపోయాడని ల్యాంబ్ చెప్పినందుకు సారీ.

31:33.060 --> 31:34.770
అది నీకు చాలా కష్టంగా ఉండుంటుంది.

31:34.770 --> 31:36.897
హా, చాలా కృంగిపోయాను.

31:37.439 --> 31:38.899
రాజీనామా కూడా చేసి ఉండే దాన్నేమో.

31:39.608 --> 31:41.068
రాజీనామా చేస్తే ఏం తోచక చావాలి.

31:42.069 --> 31:43.654
వెస్ట్ ఏకర్స్ ఉదంతం గురించి కొత్తగా ఏమైనా తెలిసిందా?

31:44.321 --> 31:45.405
ఏమీ తెలీలేదు.

31:45.405 --> 31:47.866
అయినా, మరిన్ని దాడులు జరిగే
అవకాశం లేదని పక్కాగా చెప్పలేకపోతున్నారు.

31:48.575 --> 31:50.619
డేవిడ్ ని చంపాలని చూసింది ఎవరో ఏమైనా తెలుసా?

31:50.619 --> 31:52.204
వాళ్లు ఫ్రాన్స్ నుండి వచ్చారని మాత్రమే తెలుసు.

31:53.956 --> 31:55.207
హలో, పింకెల్.

31:57.292 --> 31:58.585
నీకు పిల్లులంటే అలర్జీ ఏం లేదు కదా?

31:59.086 --> 32:00.671
లేదు, కానీ నాకు అవంటే ఇష్టం లేదు.

32:01.463 --> 32:02.798
డేవిడ్?

32:05.467 --> 32:06.468
డేవిడ్?

32:08.804 --> 32:09.888
డేవిడ్?

32:10.806 --> 32:12.057
క్యాథరిన్!

32:13.308 --> 32:15.143
వెనుక తలుపు తెరిచి ఉంది!

32:16.144 --> 32:17.396
ఓరి దేవుడా.

32:28.240 --> 32:29.408
అయ్య బాబోయ్.

32:30.492 --> 32:31.827
ఇప్పుడు రివర్ కి ఏం సమాధానం చెప్పాలి?

32:31.827 --> 32:33.412
ల్యాంబ్ కి ఏం సమాధానం చెప్పాలి?

32:34.496 --> 32:35.914
...నాకు స్వేచ్ఛ లభించింది.

32:37.207 --> 32:41.795
మీ వ్యవస్థ కారణంగా చాలా ఏళ్లు బంధీగా గడిపాను,
దానికి మీరు శిక్ష అనుభవించాల్సిందే.

32:44.173 --> 32:46.300
నాలా అనేక మంది పుట్టుకొస్తారని ఆశిస్తున్నా.

32:49.511 --> 32:51.388
త్వరలోనే, నా సోదరులు మిమ్మల్ని పలకరిస్తారు.

32:53.015 --> 32:54.516
నేను...

32:54.516 --> 32:57.060
...వెస్ట్ ఏకర్స్ షాపింగ్ మాల్
బయట ఉన్న వీధిలోనే ఉన్నాను,

32:57.060 --> 32:58.312
ఇక్కడ వాతావరణంలో ఇంకా...

32:58.312 --> 33:00.189
నేను చేదు వార్తతో వచ్చాను.

33:02.566 --> 33:03.859
ఏంటది?

33:04.985 --> 33:07.487
ఇదా? ఇది పూల బొకే.

33:09.239 --> 33:10.908
తొక్కేం కాదు.

33:10.908 --> 33:12.576
ఇది మంచి వాసనొచ్చే పూల లాకెట్.

33:12.576 --> 33:14.870
గ్రేట్ ప్లేగ్ సమయంలో, శవాల వాసన తెలీకుండా ఉండటానికి

33:14.870 --> 33:17.623
జనాలు దీన్ని వాసన చూసేవాళ్లు.

33:17.623 --> 33:18.916
దొబ్బేయ్.

33:20.709 --> 33:23.170
పార్కులో నాకు తెలిసిన వాళ్లని అడిగా,

33:23.170 --> 33:27.549
డేవిడ్ కార్ట్ రైట్ ఫ్రాన్స్ కి వెళ్లాడు అనడానికి
ఒక్క ఆధారం కూడా లేదట.

33:28.425 --> 33:29.968
అయితే, మన మధ్య ఒప్పందం గంగలో కలిసిపోయినట్టేగా.

33:32.346 --> 33:33.722
అంతేగా మరి.

33:33.722 --> 33:35.474
నీ పీడ విరగడయ్యేలా లేదు నాకు.

33:36.475 --> 33:42.189
కానీ, 1990ల ప్రారంభంలో
అతని ఏజెంట్ ఒకడు అక్కడికి వెళ్లాడని తెలిసింది.

33:43.649 --> 33:44.650
లవాండ్ కా?

33:45.150 --> 33:46.360
అవును.

33:48.028 --> 33:53.158
హో దగ్గరికి వెళ్లి, నిన్ను స్లౌ హౌసుకు ఎందుకు
పంపారో కనుక్కోమని, నేను చెప్పానని చెప్పు.

33:53.158 --> 33:54.409
- నిజంగానా?
- అవును.

33:54.409 --> 33:55.744
హా, నువ్వు ఇక్కడ ఉంటే నేను చస్తా.

33:55.744 --> 34:00.832
పిచ్చి శామ్ చాప్మన్ ఫ్రాన్స్ కి వెళ్లాడని చెప్పావుగా,
అది చాలు నాకు నిన్ను పంపించేయడానికి.

34:20.268 --> 34:21.687
ఇదుగోండి. జాగ్రత్తగా చూడండి.

34:22.728 --> 34:24.231
మీరు అతడిని ఖచ్చితంగా చూడలేదంటారా?

34:24.231 --> 34:25.732
ఇక్కడికి దగ్గర్లోనే ఉంటాడు అతను.

34:26.233 --> 34:28.193
పదమూడేళ్లు ఉంటాయి.
వయస్సు కాస్త ఎక్కువే ఉన్నట్టు కనిపిస్తాడు.

34:28.193 --> 34:29.862
కేజే అని పిలుస్తుంటారు అతడిని.

34:29.862 --> 34:31.321
మీ ఉద్దేశం కేజీనా?

34:32.364 --> 34:33.489
అయితే, అతను మీకు తెలుసా?

34:33.489 --> 34:35.701
డబ్బు ఇస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందది.

34:35.701 --> 34:36.909
ఇస్తానేమో.

34:37.828 --> 34:38.871
అయితే ముందు అడ్వాన్స్ ఇవ్వండి.

34:38.871 --> 34:40.621
ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు.

34:41.665 --> 34:45.210
మీకు అతని గురించి తెలుసని కూడా నాకు అనిపించట్లేదు.

34:45.210 --> 34:47.170
ఏటీయం దాకా వెళ్దాం మరి.

34:49.464 --> 34:52.467
నేను చండాలంగా ఉంటా, నా ముఖంపై
గాయాలైనా కూడా నాకేం పర్లేదు. మరి నీకు ఓకేనా?

34:58.432 --> 34:59.433
పిల్లలంటే మోజు అతనికి.

35:01.685 --> 35:02.853
హలో, సమస్యల బాబు.

35:03.353 --> 35:04.438
మనం కలుసుకోవాలి.

35:05.063 --> 35:06.440
మూడవ లాండ్రీ షాపులో కలుసుకుందాం.

35:06.440 --> 35:08.901
నాకు దాని కన్నా ముఖ్యమైన పని ఉందంటే?

35:08.901 --> 35:09.985
దాని కన్నా ఇదే ముఖ్యం.

35:11.737 --> 35:13.447
ముసలాడు కనిపిస్తున్నాడు.

35:14.865 --> 35:16.533
సరే, అయితే లేపేసేయ్.

35:17.618 --> 35:18.702
ఇప్పుడు జనం మధ్య ఉన్నాడు.

35:19.203 --> 35:23.624
అతడిని నువ్వు వెంబడిస్తున్నావని అతనికి తెలియాలి.
కంగారుపడి, ఎక్కడైనా దాక్కోవడానికి ప్రయత్నిస్తాడు.

35:24.541 --> 35:27.127
అప్పుడు మూడో కంటికి తెలీకుండా చంపేసేయ్,
ఆ తర్వాత కార్ట్ రైట్ సంగతి చూడు,

35:35.302 --> 35:36.386
డాన్సర్ బ్లెయిన్?

35:37.638 --> 35:39.556
నీ కోసం ఒక వస్తువును తీసుకొచ్చా.

35:39.556 --> 35:41.517
ఎవరు పంపారు నిన్ను?

35:41.517 --> 35:42.976
ఎవరూ పంపలేదు.

35:42.976 --> 35:44.520
మరి నా గురించి ఎలా తెలుసు నీకు?

35:44.520 --> 35:46.522
నేను ఎంఐ5 ఏజెంటుని.

35:47.231 --> 35:48.440
ఇదేమైనా స్టింగ్ ఆపరేషనా?

35:49.191 --> 35:52.861
నేను ఎంఐ5 ఏజెంట్ అని చెప్పేశాగా,
ఇక ఇది స్టింగ్ ఆపరేషన్ ఎలా అవుతుంది?

35:54.071 --> 35:55.072
నిజమే.

36:12.047 --> 36:12.881
సరే మరి.

36:30.566 --> 36:32.651
నన్ను డాన్సర్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

36:33.527 --> 36:35.112
బ్రేక్ డాన్స్ అదరగొట్టేస్తావు అనా?

36:36.363 --> 36:41.702
హా, అంతే కాకుండా ప్రమాదాన్ని పసిగట్టి,
దాని ముందు కూడా డాన్స్ వేయగలనని.

36:42.369 --> 36:46.999
ఎంఐ5 ఆఫీసరుతో వ్యవహారమంటే,
ఏదో సమస్యే అని అనిపిస్తోంది నాకు.

36:48.709 --> 36:50.169
నాకు తుపాకీ ఎందుకు అమ్మాలనుకుంటున్నావు?

36:50.169 --> 36:51.962
- ఇప్పటికిప్పుడే డబ్బు కావాలి.
- బ్యాంకుని దోచుకోవచ్చుగా.

36:51.962 --> 36:54.256
నీకు తుపాకీ వద్దకపోతే, నాకేం పర్లేదు.
నేను ఇంకెక్కడికైనా వెళ్తా.

36:54.256 --> 36:56.592
ఇంకెక్కడికీ వెళ్లలేవు. ఎందుకంటే నీకు డబ్బు కావాలి.

36:56.592 --> 36:58.218
డాన్సర్ లో ఉండే మరో గొప్పదనం అదే.

36:58.218 --> 37:00.053
జనాలను బాగా అర్థం చేసుకొని,
వాళ్లు ఏం చేస్తారో ఊహించడం.

37:00.053 --> 37:01.889
నీకు మంచి హృదయమే ఉందని చెప్పగలను.

37:02.514 --> 37:04.391
కానీ నీకు దారులన్నీ మూసుకుపోయాయి.

37:13.400 --> 37:14.735
బెరేటా యం9.

37:14.735 --> 37:18.113
సిగ్ సార్ పీ226 తుపాకీని తలదన్ని
1985 నుండి ఇప్పటి దాకా యుఎస్ సైన్యంలో

37:18.113 --> 37:21.825
ప్రధాన సైడ్ తుపాకీగా రాజ్యమేలుతోంది.

37:25.746 --> 37:27.331
- మూడు వేలు ఇస్తా.
- దాని విలువ అయిదు వేలు.

37:27.331 --> 37:30.375
అది ఓకే. దీన్ని నేను అయిదు వేలుకు
అమ్ముకోగలను. నాకు కూడా లాభం ఉండాలి కదా.

37:33.086 --> 37:35.255
- సరే, నాలుగున్నర వేలు.
- మూడు.

37:36.340 --> 37:37.424
- నాలుగు.
- మూడు.

37:38.175 --> 37:39.635
- మూడున్నర.
- మూడు.

37:47.601 --> 37:48.977
- మూడు.
- అదీ లెక్క.

37:51.063 --> 37:52.523
భలే బేరం ఆడావోయ్.

38:16.213 --> 38:18.298
కాస్త తొందరగా వస్తే, పుణ్యముంటుంది.

38:18.298 --> 38:19.383
ఒకరు వెంబడిస్తున్నారు.

38:20.259 --> 38:21.593
ఎక్కడ ఉన్నావు?

38:21.593 --> 38:23.345
వాళ్లని నీకు దూరంగా తీసుకెళ్లి, తప్పించుకొని వస్తా.

38:24.137 --> 38:27.599
పదమూడేళ్ల అబ్బాయి కోసం వెతికే
కేసుకు సంబంధించినది కావచ్చు ఇది.

38:27.599 --> 38:28.517
వాడు పారిపోయాడు.

38:28.517 --> 38:31.186
చెడు సావాసాలు చేశాడు.
ఇప్పుడే అలాంటి వాళ్లతో మాట్లాడి వస్తున్నా.

38:31.186 --> 38:33.230
- నా వెంట పడేది వాళ్లే అయ్యుండవచ్చు.
- వాళ్లు కాదు.

38:33.230 --> 38:36.692
నిన్న రాత్రి ఎవరో డేవిడ్ కార్ట్ రైట్ ని చంపాలని చూశారు.

38:36.692 --> 38:38.235
అయ్యయ్యో. ఎవరు?

38:38.235 --> 38:41.363
నాకు తెలీదు, కానీ ఆ ముసలి నక్క
ఒక షాట్ గన్ తో వాడిని చంపేశాడు.

38:41.363 --> 38:43.866
- నిన్ను వెతుక్కుంటూ ఎవరైనా వచ్చారా?
- ఇంకా లేదు.

38:44.783 --> 38:46.493
నేను రెండవ ఎమర్జెన్సీ సేఫ్ హౌస్ కి వెళ్తా.

38:47.160 --> 38:49.413
నిన్ను వెంబడించే వాడు ఏదైనా పిచ్చి పని చేస్తే
అడ్డుకోవడానికి, మార్కెట్ నుండి

38:49.413 --> 38:51.582
ఎవరైనా స్లో హోర్సులని నిన్ను ఫాలో అవ్వమంటా.

39:16.899 --> 39:18.192
తిరిగి కాల్ చేశావే, సూపర్.

39:18.192 --> 39:21.278
ల్యాంబ్ కాల్ చేశాడు. పిచ్చి శామ్ చాప్మన్ ని
కలుస్తున్నాడట, బ్యాకప్ గా మనల్ని రమ్మన్నాడు.

39:21.278 --> 39:24.114
మార్కెట్ నుండి రెండవ ఎమర్జెన్సీ సేఫ్ హౌస్ కి
చాప్మన్ ని ఫాలో చేయమని చెప్పాడు.

39:24.114 --> 39:25.574
హా. అది పాత గ్యారేజీ.

39:26.366 --> 39:28.827
నిజానికి, నేను పెద్ద దూరంలో కూడా లేను.
వీలనైంత త్వరగా అక్కడికి వచ్చేస్తా.

39:28.827 --> 39:30.579
మర్చిపోకుండా తుపాకీ తెచ్చుకో.

39:30.579 --> 39:32.206
అయ్యయ్యో. తుపాకీ అంటే కష్టం కదా.

39:32.873 --> 39:33.874
నీ యెంకమ్మ.

40:44.945 --> 40:45.946
షర్లీ!

40:47.072 --> 40:48.073
షర్లీ!

40:49.283 --> 40:51.743
అబ్బా. మన గురించి అందరికీ తెలియాలా?

40:53.787 --> 40:55.247
చాప్మన్ పావు కిలోమీటరు దూరంలో ఉన్నాడు.

40:57.541 --> 41:00.377
సరే. మరి అతడిని వెంబడించే వాడు ఎక్కడ?

41:00.377 --> 41:02.546
కనిపించినట్టే కనిపించి, మాయమైపోయాడు.

41:03.130 --> 41:05.048
నన్ను చూసి, పారిపోయి ఉంటాడు.

41:05.549 --> 41:06.967
నీ టోపీ చూసినా, ఎవరైనా పారిపోతారనుకో.

41:13.974 --> 41:15.017
అబ్బా.

41:15.642 --> 41:18.145
- నువ్వు ఓకేనా?
- కాదు.

41:18.145 --> 41:19.479
అబ్బా.

41:22.482 --> 41:23.775
దేవుడా.

41:27.905 --> 41:29.031
మీరు బాగానే ఉన్నారా?

41:29.781 --> 41:30.782
బాగానే ఉన్నా.

41:31.283 --> 41:32.284
ఛ.

41:46.423 --> 41:48.050
ఎత్తు. ఎత్తు.

41:49.176 --> 41:50.344
వాడిని వదిలించుకోలేకపోతున్నా.

41:50.344 --> 41:52.429
- మనం ఇప్పుడు కలవవద్దులే.
- లేదు, నువ్వు నడుస్తూనే ఉండు.

41:52.429 --> 41:54.306
- నేను అక్కడికే వచ్చేస్తా.
- సరే.

43:04.418 --> 43:05.669
బయటకు రా, ముసలోడా.

43:08.172 --> 43:09.673
నీ పనైపోయింది. బయటకు రా.

44:23.830 --> 44:24.831
నువ్వు బాగానే ఉన్నావా?

44:27.793 --> 44:30.754
ఇదుగో, అతడిని లేపి, ట్యాక్సీలో ఎక్కించు.

44:32.297 --> 44:33.882
కారు తగిలి పడినవాడి సంగతి చూసుకుంటా.

46:00.969 --> 46:02.971
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్
